Vatsalya Scheme | చిన్నారులకు ఆర్థిక అండగా ‘మిషన్ వాత్సల్య’ పథకం .. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి
Vatsalya Scheme | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాధారంగా, సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు భరోసా ఇచ్చేలా ‘మిషన్ వాత్సల్య’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రుల్లో ఒకరైన మృతి చెందినా, ఇద్దరూ లేకపోయినా లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం అందుతోంది. ఈ పథకం 1 నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు వర్తిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,400, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,600 వాటా భాగంగా అందిస్తోంది. ఈ పథకాన్ని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది.

#image_title
ఇప్పటి వరకూ రెండు విడతలు పూర్తి
ఇప్పటికే మిషన్ వాత్సల్య పథకం కింద రెండు విడతల్లో పిల్లలకు సహాయం అందింది. ప్రస్తుతం మూడో విడత కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
ఎవరు అర్హులు?
వయసు: 1–18 ఏళ్ల మధ్య
తల్లిదండ్రుల్లో ఒకరు/ఇద్దరూ లేకపోవాలి లేదా తీవ్ర వ్యాధితో బాధపడుతూ పిల్లలు నిస్సహాయతకు గురై ఉండాలి
కుటుంబ వార్షిక ఆదాయం:
గ్రామీణ ప్రాంతాల్లో రూ.72,000 లోపు
పట్టణాల్లో రూ.96,000 లోపు
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
సమీప ICDS అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించండి
అంగన్‌వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులు, CDPOల సహాయంతో దరఖాస్తు చేయవచ్చు
కావలసిన ధ్రువపత్రాలు జతపరచాలి
అవసరమైన డాక్యుమెంట్లు:
పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికేట్)
ఆదాయ ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం
తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్ కార్డు కాపీ
రేషన్ కార్డు కాపీ
బ్యాంక్ పాస్‌బుక్ ఫోటో కాపీ
పై పత్రాలపై గెజిటెడ్ అధికారుల సంతకం తప్పనిసరి