Ashwin : ఇటీవల చాలా మంది ప్లేయర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెబుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్స్ కూడా ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు.ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే గబ్బా వేదికగా అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్ళను బెంబేలెత్తించిన రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు… ఈ మేరకు బిసిసిఐ వెల్లడించింది. ఇప్పటి వరకు భారత టెస్టు చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడిగా పేరుగాంచాడు. ఈ టూర్‌లో అతనికి ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం లభించింది.
అడిలైడ్ తర్వాత, అతను గబ్బా టెస్టుకు దూరమయ్యాడు. గబ్బా టెస్టు సందర్భంగా అశ్విన్ టీమిండియా ఆటగాళ్లను కౌగిలించుకుంటూ కనిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. అశ్విన్ కూడా హెడ్ కోచ్ గంభీర్‌తో చాలాసేపు మాట్లాడి, ఆపై విలేకరుల సమావేశానికి వచ్చి రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్.. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ సమయంలో అశ్విన్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. పెర్త్ టెస్ట్ విజయం తర్వాతే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడని, కానీ కెప్టెన్ రోహిత్ పింక్ బాల్ టెస్ట్ ఆడేలా కన్విన్స్ చేసినట్లు తెలిపాడు.
అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 106 మ్యాచ్‌లు ఆడి 537 వికెట్లు తీశాడు. అతను తన పేరిట 37 ఐదు వికెట్లు సాధించాడు. మ్యాచ్‌లో 8 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ వన్డేల్లో 156 వికెట్లు కూడా తీశాడు. టీ20లో అశ్విన్ 72 వికెట్లు తీశాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో 765 వికెట్లు సాధించాడు. బ్యాట్స్‌మెన్‌గానూ అశ్విన్ తనదైన ముద్ర వేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 3503 పరుగులు చేశాడు. అతను మొత్తం 6 టెస్ట్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 8 సెంచరీలు చేశాడు. కాగా,గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
YCP : జమిలి ఎన్నికల విషయంలో దేశంలో ఇపుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇండియా…
Neha Shetty : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా ప్రస్తుతం…
Fruit Salads : ప్రస్తుత కాలంలో ఫ్రూట్ సలాడ్స్ ను కలిపి తింటూఉంటారు. కానీ ఇలా తినవచ్చా లేదా అనేది…
TTD : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ దర్శనానికి ముఖ్యమైన ఏర్పాట్లను ప్రకటించింది. జనవరి…
Cancer Vaccine : ఈ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణ. రష్యా ప్రభుత్వం తన స్వంత క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు…
Ind Vs Aus : ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే ఎంతటి మజా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు టెస్ట్‌ల…
Winter : చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో నారింజ పండ్ల లాంటివి తినడానికి వెనకాడుతారు. ఎందుకంటే జలుబు,దగ్గు, ఫ్లూ,…
Phone And Laptop : ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ లాప్టాప్ కి లేదా ఫోన్లకి అతుక్కొని పోతున్నారు. ఇలా…
This website uses cookies.