Ind Vs Aus : గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు సంకేతాలు.. మ్యాచ్ డ్రాగా ప్ర‌క‌టించిన అంపైర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ind Vs Aus : గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు సంకేతాలు.. మ్యాచ్ డ్రాగా ప్ర‌క‌టించిన అంపైర్స్

 Authored By ramu | The Telugu News | Updated on :18 December 2024,11:29 am

ప్రధానాంశాలు:

  •  Ind Vs Aus : గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు సంకేతాలు.. మ్యాచ్ డ్రాగా ప్ర‌క‌టించిన అంపైర్స్

Ind Vs Aus : ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే ఎంత‌టి మ‌జా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ ముందు ఊరించే లక్ష్యం నమోదైంది. 185 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేయ‌డంతో భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం నమోదైంది. చివరి రోజు ఆటలో ఇంకా 56 ఓవర్ల ఆట మిగిలింది. వర్షం అంతరాయం కలిగించకుండా ఉండకుండా 56 ఓవర్ల ఆట సాగితే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉంది. ఐదో రోజు మాత్రం స్టేడియం దగ్గర ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు వల్ల అంపైర్లు ఆటను నిలిపేశారు. తర్వాత కాసేపటికే జోరుగా వర్షం కురిసింది.

Ind Vs Aus గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు పిడుగుపాటు సంకేతాలు మ్యాచ్ డ్రాగా ప్ర‌క‌టించిన అంపైర్స్

Ind Vs Aus : గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు సంకేతాలు.. మ్యాచ్ డ్రాగా ప్ర‌క‌టించిన అంపైర్స్

Ind Vs Aus మ్యాచ్ డ్రా..

చివరి రోజు కూడా ఉదయం 4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టీమిండియా తన చివరి వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో 8 పరుగులు జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ దీప్ (31)ను ట్రావిస్ హెడ్ ఔట్ చేశాడు. బుమ్రాతో కలిసి ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన ఆకాశ్ దీప్.. చివరి వికెట్ గా వెనుదిరిగాడు. బుమ్రా 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియాకు 185 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఆట‌ని ఆపివేయ‌డానికి గ‌ల కార‌ణాన్ని అంపైర్ సైమ‌న్ టాఫెల్ వివ‌రించాడు.. ఐసీసీ 30-30 మెరుపుల నిబంధన ప్రకారం ఓ మెరుపు కనిపించి 30 సెకన్లలోపు పిడుగుపాటు శబ్దం వినిపిస్తే వెంటనే ఆట ఆపేయాలి. అంపైర్లు గబ్బా స్టేడియంలో అదే చేశారు. ఒకవేళ తుఫాను దూరంగా వెళ్లిపోతూ, 30 సెకన్లకు కాస్త అటూఇటూగా ఈ పిడుగుపాటు జరిగితే అంపైర్లు తమ విచక్షణ మేరకు ఆటను కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చట‌

గబ్బా స్టేడియంలో మెరుపు చాలా దగ్గరగా కనిపించిందని, 30 సెకన్లలోపే పిడుగు పడిన శబ్దం రావడంతో ఆటను అంపైర్లు నిలిపేసినట్లు చెప్పాడు. ఇది ప్లేయర్స్, అఫీషియల్స్, గ్రౌండ్ స్టాఫ్, ప్రేక్షకుల భద్రత కోసం తీసుకొచ్చిన నిబంధన అని తెలిపాడు. నవంబర్ లో పాకిస్థాన్ టీమ్ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు తొలి టీ20 మ్యాచ్ ఈ పిడుగుపాటు వల్ల ఆలస్యమైంది. ఆ మ్యాచ్ కూడా గబ్బా స్టేడియంలోనే జరగడం గమనార్హం.రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు భారత బౌలర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/18), ఆకాశ్ దీప్(2/28), మహమ్మద్ సిరాజ్(2/38) నిప్పులు చెరగడంతో ఆసీస్ 85 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే ఆ జట్టు డిక్లేర్ చేసింది. Ind Vs Aus australia and india Test match drawn ,

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది