Venu Swamy : అప్పట్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిందే ఇప్పుడు చంద్రబాబు జీవితంలో జరిగింది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Venu Swamy : అప్పట్లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిందే ఇప్పుడు చంద్రబాబు జీవితంలో జరిగింది..!!

Venu Swamy : రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్రులు వేణు స్వామి అందరికీ సుపరిచితుడే. సినీ మరియు రాజకీయ రంగంలో ఉండే ప్రముఖుల జీవితాలలో జరగబోయేది ముందుగానే చెబుతూ ఎంతో పాపులర్ అయ్యారు. వేణు స్వామి సెలబ్రిటీల జీవితాలలో జరగబోయేది చెబుతూనే మరోపక్క వాటి నివారణకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇదే తరుణంలో చాలామంది హీరోయిన్స్ ఇంకా రాజకీయ రంగానికి చెందిన వాళ్ల విషయాలలో.. రకరకాల పూజలు కూడా చేయడం జరిగింది. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :12 September 2023,6:00 pm

Venu Swamy : రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్రులు వేణు స్వామి అందరికీ సుపరిచితుడే. సినీ మరియు రాజకీయ రంగంలో ఉండే ప్రముఖుల జీవితాలలో జరగబోయేది ముందుగానే చెబుతూ ఎంతో పాపులర్ అయ్యారు. వేణు స్వామి సెలబ్రిటీల జీవితాలలో జరగబోయేది చెబుతూనే మరోపక్క వాటి నివారణకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇదే తరుణంలో చాలామంది హీరోయిన్స్ ఇంకా రాజకీయ రంగానికి చెందిన వాళ్ల విషయాలలో.. రకరకాల పూజలు కూడా చేయడం జరిగింది.

వేణు స్వామి చెప్పే మాటలన్నీ చాలా నిజమవుతూ ఉండటంతో నమ్మే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. తాజాగా చంద్రబాబు విషయంలో కూడా ఇదే జరిగింది. 2023 జనవరి కొత్త సంవత్సరం రావడానికి ముందు. ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ కి వేణు స్వామి ఇంటర్వ్యూ ఇస్తూ చంద్రబాబు జాతకం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 జనవరి నుంచి చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. ఆయన జాతకంలో గ్రహాలు మారడం వల్ల జనవరి నుంచి ఆరోగ్యపరమైన ఇంక న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

Astrologer Venu Swamy Predicts Chandrababu Dangerous Future

ఈ రకంగా అప్పుడు వేణు స్వామి చంద్రబాబు జాతకం గురించి చెప్పినటువంటి కామెంట్స్ ఇప్పుడు తాజాగా బాబు గారు జైలుకు వెళ్లడంతో.. వేణు స్వామి అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని సిఐడి పోలీసులు అరెస్టు చేయడం తర్వాత ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది