Minister RK Roja : చంద్రబాబు అరెస్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పై మంత్రి రోజాకి ఎలక వ్యాఖ్యలు..!!

Advertisement

Minister RK Roja : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు కావటం వల్ల మంత్రి రోజా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన అరెస్టు కావటంతో ప్రకృతి కూడా పులకించిపోయిందని వర్షం పడిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. నిజంగా 2009లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తూ శ్రీకాకుళం నుండి వస్తూ.. ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ప్రాణానికి తెగించి మరి..

Advertisement

ప్రచారం చేశారు. రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఎలా వాడుకున్నారో అందరికీ బాగా తెలుసు. తన కొడుకు లోకేష్ కోసం అటువంటి ఎన్టీఆర్ నీ పార్టీ నుండి తరిమేసి.. హరికృష్ణ గారికి చివరి దశలో పదవులు ఇవ్వకుండా అవమానించి.. ఎన్టీఆర్ సినిమాలు ఆడునీవ్వకుండా.. కక్ష సాధింపు చర్యలు చేసి.. ఈరోజు ఎన్టీఆర్ మాట్లాడటం లేదని విమర్శించడం సిగ్గుచేటు అని అన్నారు. అంటే మీరు ఏది చెబితే అలా పవన్ కళ్యాణ్ లాగా వచ్చేసి స్క్రిప్ట్ చదివి వెళ్లిపోవాలి. ఎవరికి ఆత్మ అభిమానాలు ఉండవా అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Minister RK Roja Comments On Pawan Kalyan

చంద్రబాబుని చంపే వాళ్లు ఎవరూ పుట్టలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం దేవుడిగా కొలిచే ఎన్టీఆర్ నే జనాల్లో ఏ విధంగా ఆయన మీద బురద జల్లించి.. ఆయన పార్టీ లాక్కొని.. చెప్పులు వేసినా కూడా.. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు దేవుడు అనే పరిస్థితికి తన చానల్స్ ద్వారా తెచ్చుకున్నాడు. రాజకీయంగా చంద్రబాబు ఎంత మందిని అంతమందించాడు ఇబ్బందులు పాలు పెట్టాడో వాటన్నిటికీ ఇప్పుడు అనుభవించే రోజు భూమ్మీద స్టార్ట్ అయ్యాయి అంటూ చంద్రబాబు జైలుకెళ్లడంపై మంత్రి రోజా సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement