Suridu : వైఎస్సార్ అనుచరుడు సూరీడుపై హత్యయత్నం.. చేసింది ఎవరో తెలుసా?
Suridu : ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడిగా సూరీడు పేరు దక్కించుకున్నాడు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో సూరీడు ఎక్కువగా ఆయన వెనుకే ఉండేవాడు. ప్రతి సమావేశంలో కూడా రాజశేఖర్ రెడ్డి వెనుకే ఉండి ఆయనకు సంబంధించిన వ్యక్తిగత అధికారిక విషయాలను గురించి చూసుకునే వాడు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత సూరీడు కనుమరుగయ్యాడు.
అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చిన సూరీడును జనాలు ఇంకా కూడా గుర్తిస్తున్నారు. జగన్ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం పార్టీ పెట్టడం వల్ల అటు వైపు సూరీడు వెళ్తాడు అనుకుంటే జగన్ వైపు ఎందుకో వెళ్లలేదు. సూరీడు అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తున్నాడు. ఆయనపై హత్యాయత్నం జరగడంతో మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు.
Suridu : అల్లుడే హత్య చేయబోయాడు..
సూరీడు కూతురు గంగా భవానికి సురేంద్రనాథ్ అనే వ్యక్తితో కొన్నాళ్ల క్రితం పెళ్లి అయ్యింది. అయితే సురేంద్రనాథ్ నుండి గంగా భవాని వేదింపులు ఎదుర్కోవడంతో తండ్రి సూరీడు ప్రోత్సాహంతో పోలీసులకు గృహసింస కింద ఫిర్యాదు చేసింది. సురేంద్ర నాథ్ గృహ హింస కేసులో కొన్నాళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. ఎట్టకేలకు అతడు బయటకు వచ్చాడు. ఇటీవల ఆయన తన మామ సూరీడు ఇంటికి వెళ్లాడు. అక్కడ మాట మాట పెరిగి గొడవ పెద్దది అయ్యింది. దాంతో అతడు కోపోద్రిక్తుడు అయ్యి దాడికి దిగాడు.
క్రికెట్ బ్యాటుతో సూరీడును కొట్టాడు. కుటుంబ సభ్యులు అడ్డు వచ్చినా కూడా సూరీడుపై సురేంద్రనాథ్ దాడి ఆపలేదు. కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో అతడు పారిపోయాడు. దాడిలో సూరీడు తీవ్రంగా గాయ పడ్డాడు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లుగా ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సూరీడుపై హత్య యత్నం చేసినందుకు గాను సురేంద్రనాథ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సూరీడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.