Chandrababu : ఏకంగా చంద్రబాబు భూమినే కబ్జా చేయబోయారు…?
సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో కబ్జాలు జరగడం అనేది ఒకరకంగా సాధారణ విషయం గానే చెప్పాలి. ఎవరి భూమిని అయినా కబ్జా చేసే అవకాశం ఉంటుంది. అందుకే భూముల విషయంలో యజమానులు పట్టణ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి రాజకీయ నాయకులకు కూడా ఇది తప్పదు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కూడా షాక్ తగిలింది.
నారావారిపల్లెలో చంద్రబాబుకు చెందిన భూమి కబ్జాకు ప్రయత్నం చేయడం గమనార్హం. సర్వే నెంబర్ 222/5లోని 38 సెంట్లు ఆక్రమించేందుకు ప్రయత్నం చేయడం షాక్ కు గురి చేసింది. చంద్రబాబు స్థలంలో రాతి కూసాలు నాటుతున్న కబ్జాదారులను గుర్తించారు.

attempt to seize land belonging to chandrababu in narawaripalle
1989లో 87 సెంట్లు రిజిస్టర్ భూమిని చంద్రబాబు నాయుడు తండ్రి ఖర్జూరనాయుడు కొనుగోలు చేసారు. 87 సెంట్లలో ఆస్పత్రి, కల్యాణ మండపానికి కొంత భూమి వితరణగా చంద్రబాబు ఇచ్చారు. చంద్రబాబుకు చెందిన 38 సెంట్ల భూమిలో ఫెన్సింగ్ ను కబ్జాదారులు వేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.