Balakrishna : బాలకృష్ణ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కి డేట్ ఫిక్స్ చేసిన బోయపాటి ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : బాలకృష్ణ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కి డేట్ ఫిక్స్ చేసిన బోయపాటి ..?

 Authored By govind | The Telugu News | Updated on :15 February 2021,7:00 am

Balakrishna : బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా బిబి3. ప్రస్తుతం ఈ పేరుతోనే బాలకృష్ణ గురించి అన్ని రకాల అప్‌డేట్స్ వస్తున్నాయి. కాని అసలు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టైటిల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. అయితే ఎట్టకేలకి బాలకృష్ణ సినిమా టైటిల్ ని ప్రకటించడానికి దర్శకుడు బోయపాటి శ్రీను డేట్ అలాగే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సింహ, లెజెండ్ సినిమాల మాదిరిగానే భారీ హిట్ సక్సస్ అందుకొని హాట్రిక్ హిట్ కొట్టాలని బోయపాటి- బాలకృష్ణ ఎంతో కసిగా ఉన్నారు.

balakrishna movie title announcement date is fixed by boyapati

balakrishna-movie-title-announcement-date-is-fixed-by-boyapati

అందుకే ఈ ఇద్దరికి బాగా కలిసి వచ్చిన మాస్ ఓరియెంటెడ్ కథతోనే ఈ హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. బిబి 3 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇటీవలే ప్రకటించారు చిత్ర యూనిట్. మే నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

Balakrishna : బాలయ్య క్యారెక్టర్ ప్రకారం మోనార్క్ అన్న టైటిల్ పర్‌ఫెక్ట్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ముందు నుంచి ఎక్కువగా ప్రచారంలో ఉన్న మోనార్క్ అన్న టైటిల్ ఫైనల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ టైటిల్ తో పాటు పలు టైటిల్ కూడా ప్రచారంలో నిలిచాయి. కాని కథలోని బాలయ్య క్యారెక్టర్ ప్రకారం మోనార్క్ అన్న టైటిల్ పర్‌ఫెక్ట్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మార్చ్ 11 న మహా శివరాత్రి పండుగ సందర్భంగా టైటిల్ ని ప్రకటించేందుకు బోయపాటి శ్రీను టీం డేట్ ఫిక్స్ చేశారట. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది