Balakrishna – Trivikram : Goosebumps తెప్పించే న్యూస్ ఇది : బాలయ్య తో త్రివిక్రమ్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna – Trivikram : Goosebumps తెప్పించే న్యూస్ ఇది : బాలయ్య తో త్రివిక్రమ్ !

 Authored By aruna | The Telugu News | Updated on :13 June 2023,3:00 pm

Balakrishna – Trivikram : ‘ అఖండ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం బాలయ్య క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ తో ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. టీజర్ సూపర్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య మరో సినిమాని లైన్లో పెట్టాడని తెలుస్తుంది. తన పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఎన్బికె 109 సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాను బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాబీ తన తర్వాతి సినిమాను బాలయ్యతో చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సందడి చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సినిమాని నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Balakrishna trivikram combination movie goosebumps

Balakrishna trivikram combination movie goosebumps

త్రివిక్రమ్ భార్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అంటే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ కచ్చితంగా జోక్యం చేసుకుంటారని టాక్ వినిపిస్తుంది. స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ జోక్యం చేసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ సినిమా లాంచ్ సమయంలో ఆ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్లో మ్యాన్షన్ హౌస్ బాటిల్, కొడవలి, గొడ్డలి కనిపించాయి. దీంతో ఈ సినిమా వైలెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కింద క్యాప్షన్ గా వైలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అని పెట్టారు. దీంతో ఈ సినిమాలో యాక్షన్ సీన్లు బాగానే ఉంటాయని తెలుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది