Balineni Srinivasa Reddy : బాలినేనికి కోపం రావడం వెనక జరిగింది ఇదే..!
Balineni Srinivasa Reddy : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడింది. దీంతో అధికార వైసీపీ పార్టీలో ఇప్పటి నుంచే అసంతృప్తులు బయటపడుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో అంతర్గత పోరు ప్రారంభం అవుతోంది. ఒక్కొక్కరు అసమ్మతిరాగం వినిపిస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో అసమ్మతి రాగం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ లిస్టులో ఇప్పుడు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేరారు. ఆయన కూడా పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు.ఆయన రెండు రోజుల కిందనే వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిజానికి.. బాలినేని పెద్ద దూరం వ్యక్తి కాదు. వైసీపీకి చాలా దగ్గరి మనిషి. సీఎం జగన్ కు బంధువే.
అయినా కూడా ఆయన ఎందుకు అలిగారు అనేది అంతుచిక్కడం లేదు. అయితే.. ఆయన ఓ సీనియర్ నాయకుడి వల్లనే అలిగినట్టు తెలుస్తోంది.2019 లో వైసీపీ అధికారంలోకి రాగానే.. బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎం జగన్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన్ను మంత్రి స్థానం నుంచి తీసేశారు జగన్. నిజానికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఆయనదే హవా. ఆయనకు పార్టీలోనూ చాలా ప్రిఫరెన్స్ ఉండేది.
Balineni : బాలినేనికి మంత్రిగా అవకాశం ఇచ్చిన జగన్
దీంతో రెండోసారి కూడా ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అనుకున్నారట. కానీ.. రెండోసారి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. ఆదిమూలపు సురేశ్ ను ఎంపిక చేశారు. దానికి కారణం వైవీ సుబ్బారెడ్డి అని అంటున్నారు. ఆయన వల్లనే బాలినేనికి మంత్రి పదవి దక్కలేదు అంటున్నారు. నిజానికి వీళ్లిద్దరూ బావాబావమరుదులే. అయినా రాజకీయాల్లో శత్రువులుగా మారిపోయినట్టు తెలుస్తోంది. అదే ఆయనకు కోపం తెప్పించి ఉండొచ్చు అని అంటున్నారు. ఆయన మంత్రి పదవి పోవడానికి వైవీ సుబ్బారెడ్డి కారణం అని జగన్ కు తెలిసినా సైలెంట్ గా ఉన్నందుకు కోపం వచ్చి ఇప్పుడు సమన్వయకర్తగా ఉన్న తన పదవికి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.