bandi sanjay comments about cm kcr on unemployment
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. గడచిన ఏడు సంవత్సరాలుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. మూడు సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ ప్రకటన కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులు ఈ ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఉన్న సమయంలో విద్యార్థుల కోసం మరియు నిరుద్యోగుల కోసం తెలంగాణ కావాలంటూ పోరాడిన కేసీఆర్ ఇప్పుడు అదే కేసీఆర్ విద్యార్థులను మరియు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు అంటూ బండి సంజయ్ ఆరోపించాడు.కేసీఆర్ ప్రభుత్వం పై నిరుద్యోగుల్లో పెరిగిన అసహనం ఆత్మహత్య ల రూపంలో చూపిస్తున్నారు.
కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్లే ఇప్పుడు విద్యార్థులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు అంటూ బండి వ్యాఖ్యానించాడు. నిరుద్యోగుల ఆత్మహత్యలు అన్నింటికి కూడా కేసీఆర్ కారణం. కనుక ఆయనపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. తెలంగాణ లో ఇప్పటికి ఇప్పుడు 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిశ్వాల్ కమిటి నివేదిక చెబుతుంది. మరి ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా ఉద్యోగ ప్రకటనలు చేయడం లేదు అంటూ బండి ప్రశ్నించారు.తెలంగాణ లో ఉద్యోగ నియామకాలు మరియు నిరుద్యోగ బృతి కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంను బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ ప్రారంభించాడు.
bandi sanjay comments about cm kcr on unemployment
ఉద్యోగాల భర్తీ కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మిలియన్ మార్చ్ ను నిర్వహించబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు. ప్రభుత్వం మెడలు వచ్చి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని బండి అన్నాడు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. అంతే కాకుండా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఉద్యోగాల ప్రకటన విడుదల చేస్తామని కూడా పేర్కొన్నాడు. విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోపం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రభావం పడక తప్పదు అంటూ విపక్ష పార్టీ ల నాయకులు అంటున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.