KCR : అప్పటి కేసీఆర్ కు ఇప్పటి కేసీఆర్ కు చాలా తేడా ఉంది బండి సంజయ్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : అప్పటి కేసీఆర్ కు ఇప్పటి కేసీఆర్ కు చాలా తేడా ఉంది బండి సంజయ్‌

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. గడచిన ఏడు సంవత్సరాలుగా గ్రూప్‌ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. మూడు సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ ప్రకటన కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులు ఈ ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ ఉన్న సమయంలో విద్యార్థుల కోసం మరియు నిరుద్యోగుల కోసం తెలంగాణ కావాలంటూ పోరాడిన కేసీఆర్ ఇప్పుడు అదే కేసీఆర్‌ […]

 Authored By himanshi | The Telugu News | Updated on :31 January 2022,9:30 pm

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. గడచిన ఏడు సంవత్సరాలుగా గ్రూప్‌ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. మూడు సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ ప్రకటన కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులు ఈ ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ ఉన్న సమయంలో విద్యార్థుల కోసం మరియు నిరుద్యోగుల కోసం తెలంగాణ కావాలంటూ పోరాడిన కేసీఆర్ ఇప్పుడు అదే కేసీఆర్‌ విద్యార్థులను మరియు నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు అంటూ బండి సంజయ్ ఆరోపించాడు.కేసీఆర్‌ ప్రభుత్వం పై నిరుద్యోగుల్లో పెరిగిన అసహనం ఆత్మహత్య ల రూపంలో చూపిస్తున్నారు.

కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్లే ఇప్పుడు విద్యార్థులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు అంటూ బండి వ్యాఖ్యానించాడు. నిరుద్యోగుల ఆత్మహత్యలు అన్నింటికి కూడా కేసీఆర్ కారణం. కనుక ఆయనపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. తెలంగాణ లో ఇప్పటికి ఇప్పుడు 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిశ్వాల్‌ కమిటి నివేదిక చెబుతుంది. మరి ఎందుకు కేసీఆర్‌ ప్రభుత్వం ఆ దిశగా ఉద్యోగ ప్రకటనలు చేయడం లేదు అంటూ బండి ప్రశ్నించారు.తెలంగాణ లో ఉద్యోగ నియామకాలు మరియు నిరుద్యోగ బృతి కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంను బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ ప్రారంభించాడు.

bandi sanjay comments about cm kcr on unemployment

bandi sanjay comments about cm kcr on unemployment

KCR : ఉద్యోగ నియామకాల కోసం బండి కోటి సంతకాల సేకరణ

ఉద్యోగాల భర్తీ కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్బంగా మిలియన్ మార్చ్‌ ను నిర్వహించబోతున్నట్లుగా కూడా ప్రకటించాడు. ప్రభుత్వం మెడలు వచ్చి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని బండి అన్నాడు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. అంతే కాకుండా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఉద్యోగాల ప్రకటన విడుదల చేస్తామని కూడా పేర్కొన్నాడు. విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోపం కేసీఆర్‌ కు వచ్చే ఎన్నికల్లో ప్రభావం పడక తప్పదు అంటూ విపక్ష పార్టీ ల నాయకులు అంటున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది