Bandi Sanjay : బైకాట్ చంద్రశేఖర్ రావు.. కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandi Sanjay : బైకాట్ చంద్రశేఖర్ రావు.. కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 April 2021,8:25 am

Bandi Sanjay : బండి సంజయ్ గురించి తెలుసు కదా. ముక్కుసూటితనం. ఏది ఉన్నా వెంటనే అనేస్తారు. ఏమాత్రం ముందూ వెనకా ఆలోచించరు. ఎదుటివాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే… విమర్శించడమే. అందుకే తెలంగాణలో ఆయన ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటారు. ఆయన ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. అందులోనూ బీజేపీ తెలంగాణలో తన దూకుడును పెంచింది. రాజకీయంగా సీఎం కేసీఆర్ టార్గెట్ చేయడానికి వాళ్లకు ఏది దొరికితే దాన్ని పట్టుకుంటున్నారు. దేన్నీ వదలడం లేదు. అందుకే బీజేపీ నేతలు కానీ… బండి సంజయ్ కానీ తెలంగాణలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతున్నారు.

bandi sanjay participated in jyothirao pule jayanthi celebrations

bandi sanjay participated in jyothirao pule jayanthi celebrations

ఆదివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఎప్పటిలాగానే బండి సంజయ్… ఈసారి కూడా సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆయన్ను టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేశారని…. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకే బీజేపీ కృషి చేస్తోందన్నారు.

Bandi Sanjay : బీసీలు ఉద్యమించాలి

బీసీ అంటే బాయ్ కాట్ చంద్రశేఖర్ రావు అనే నినాదంతో బీసీలంతా ఐక్యంగా ఉద్యమించాలి.  ఎందరో మహనీయుల చరిత్రనే కనుమరుగు చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు. తెలంగాణ క్యాబినేట్ లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు.. ఉన్న ఇద్దరు ముగ్గురు బీసీ మంత్రులు కూడా కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేవాళ్లే. పేదల కోసం, మహిళల కోసం జ్యోతిరావు పూలే ఎలా పోరాటం చేశారో….. ఇప్పుడు దళితులు, బహుజనుల కోసం మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. బీసీ వర్గానికి చెందిన మోదీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. జ్యోతిరావు పూలే లాంటి మహనీయులకు నివాళులు అర్పించాలి… కనీస గౌరవం ఇవ్వాలని కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదు. ఖాళీగానే ఉంటారు కానీ… మహనీయులకు నివాళులు అర్పించరు… అని బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది