ప్రస్తుతం తెలంగాణలో ఒకటే చర్చ. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా త్వరలో కేటీఆర్ పట్టాభిషేకం. అసలు.. చరిత్రలోనే ఎవ్వరూ చేయని పని ఇది. ఒక తండ్రి.. తన కొడుకుకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించడం అనేది ఇప్పుడే చరిత్ర సృష్టించనుంది. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. అయితే.. నిజంగానే కేటీఆర్ ను కేసీఆర్ ముఖ్యమంత్రిని చేస్తున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత లేనప్పటికీ.. ప్రచారం మాత్రం జోరందుకుంది.
ఈ నేపథ్యంలో సందు దొరికింది కదా.. అని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అలా ఎలా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారంటూ విమర్శిస్తున్నారు కానీ.. వాళ్లను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ను విమర్శించే దమ్మున్న నాయకుల్లో బండి సంజయ్ ఒకరు. ఆయన ఎప్పుడూ సీఎం కేసీఆర్ ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి.. బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ సవాల్ విసురుతుంటారు. మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ సారి త్వరలో ముఖ్యమంత్రి కాబోయే కేటీఆర్ మీద తన విమర్శనాస్త్రాలు ప్రదర్శించారు.
కేసీఆర్… కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసమే.. తన ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజను నిర్వహించారు. పూజ చేసిన వస్తువులను తీసుకెళ్లి.. త్రివేణి సంగమంలో కలిపారు. అందుకే కాళేశ్వరం పర్యటన అంటూ కొత్త నాటకం ఆడారు. కానీ.. కాళేశ్వరం వెళ్లింది తన సొంత పనికోసం. ఇక.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే మాత్రం తెలంగాణలో ఆటమ్ బాంబ్ కాదు.. ఏకంగా అణుబాంబే పేలుతుంది.. అంటూ బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ ముఖ్యమంత్రి.. అంటూ బయట జరుగుతున్న ప్రచారం అంతా ఒక డ్రామా. కేసీఆర్ మీద ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి పోకుండా ఉండేందుకు.. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్.. రెండూ దొందు దొందే… తోడు దొంగలే అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.