Dog : సినిమా సెలబ్రిటీల లైఫ్ మామూలుగా ఉండదు. ఏ రకంగా సంపాదిస్తారో… అదే తరహాలో ఖర్చు పెడుతూ ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ.. జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. కెరియర్ పరంగా మంచి హిట్లు పడితే ఇంకా తిరిగి చూసుకో అక్కర్లేదు. కొన్ని తరాలు అనుభవించేలా ఆస్తులు సంపాదిస్తారు. ఇక ఇదే సమయంలో ఆస్తులు కూడాబెట్టుకోవడంతో పాటు ఖరీదైన కుక్కలు కూడా సెలబ్రిటీలు కొనుగోలు చేయడం మనకు తెలిసిందే. తెలుగు సినిమా రంగంలో ఒకప్పుడు ఎన్టీఆర్ దగ్గర హైదరాబాద్ లోనే అత్యంత పొడవైన కుక్క ఉండేది. కానీ కొన్నాళ్ళు తర్వాత చచ్చిపోయింది. ఇక చరణ్, పూరి జగన్నాథ్ దగ్గర రకరకాల జాతుల కుక్కలు ఉంటాయి. వీటి ధరలు లక్షలలో ఉంటాయి.
అయితే ఓ ప్రముఖ నటుడు ఇటీవల 20 కోట్లు పెట్టి ప్రపంచంలోనే అరుదైన జాతికి చెందిన కుక్కను కొనుగోలు చేశాడు. వివరలోకే వెళ్తే బెంగళూరుకి చెందిన సతీష్ అనే వ్యక్తి ఖరీదైన కుక్కను కొన్నాడు. ఈయన నటుడు మరియు ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. ఎప్పటికప్పుడు అరుదైన జాతులు కలిగిన కుక్కలు కొంటూ వార్తలు నిలుస్తూ ఉంటాడు. లేటెస్ట్ గా ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాకేసియన్ షెపర్డ్ అనే జాతి కుక్కని ఈయన కొనుగోలు చేశారు. ఇవి టర్కీ, ఆర్మేనియా, సర్కాసియా, జార్జియా దేశాల్లో దొరుకుతాయి. ఇండియాలో చాలా అరుదుగా ఉంటాయి. కాపలా కోసం వీటిని ఉపయోగిస్తారు. ఇలాంటి అరుదైన జాతికి చెందిన కుక్కల్ని కొంటూ సతీష్ సెలబ్రిటీ అయిపోయారు.
దీని లైఫ్ టైం పీరియడ్ 10 నుంచి 12 సంవత్సరాలు మాత్రమే బతుకుతుంది. దీని శరీరంపై బొచ్చు ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో చాలామంది తమ ఆస్తుల రక్షణ కోసం వీటిని వాడుతుంటారు. కాకేసియన్ షెపర్డ్ శునకాలు తమ యజమానులకు ఎంతో నమ్మకంగా ఉంటాయి. దొంగలు మరియు తోడేలు నుంచి రక్షిస్తాయి. ఈ క్రమంలో నటుడు సతీష్ ఏడాదిన్నర వయసున్న ఈ కుక్కకి కడబామ్ హెడర్ అనే పేరు పెట్టాడు. ఇటీవల కొన్ని కుక్కల కాంపిటేషన్లలో పాల్గొని 32 కి పైగా మెడల్స్ కడబామ్ హెడర్ గెలుచుకోవటం విశేషం. ఇక ఇదే సమయంలో సతీష్ దగ్గర ఇదే జాతికి చెందిన రెండు కుక్కపిల్లలు ఉన్నాయి. వీటిని పరిచయం చేయడానికి కూడా సతీష్ రెడీ అవుతున్నాడు.
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
This website uses cookies.