Dog : వామ్మో ఏకంగా 20 కోట్లు పెట్టి కుక్క‌ను కొన్న న‌టుడు.. దాని ప్ర‌త్యేక‌త ఏంట‌బ్బా… వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dog : వామ్మో ఏకంగా 20 కోట్లు పెట్టి కుక్క‌ను కొన్న న‌టుడు.. దాని ప్ర‌త్యేక‌త ఏంట‌బ్బా… వీడియో

Dog : సినిమా సెలబ్రిటీల లైఫ్ మామూలుగా ఉండదు. ఏ రకంగా సంపాదిస్తారో… అదే తరహాలో ఖర్చు పెడుతూ ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ.. జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. కెరియర్ పరంగా మంచి హిట్లు పడితే ఇంకా తిరిగి చూసుకో అక్కర్లేదు. కొన్ని తరాలు అనుభవించేలా ఆస్తులు సంపాదిస్తారు. ఇక ఇదే సమయంలో ఆస్తులు కూడాబెట్టుకోవడంతో పాటు ఖరీదైన కుక్కలు కూడా సెలబ్రిటీలు కొనుగోలు చేయడం మనకు తెలిసిందే. తెలుగు సినిమా రంగంలో ఒకప్పుడు ఎన్టీఆర్ దగ్గర […]

 Authored By sekhar | The Telugu News | Updated on :6 January 2023,6:20 pm

Dog : సినిమా సెలబ్రిటీల లైఫ్ మామూలుగా ఉండదు. ఏ రకంగా సంపాదిస్తారో… అదే తరహాలో ఖర్చు పెడుతూ ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ.. జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. కెరియర్ పరంగా మంచి హిట్లు పడితే ఇంకా తిరిగి చూసుకో అక్కర్లేదు. కొన్ని తరాలు అనుభవించేలా ఆస్తులు సంపాదిస్తారు. ఇక ఇదే సమయంలో ఆస్తులు కూడాబెట్టుకోవడంతో పాటు ఖరీదైన కుక్కలు కూడా సెలబ్రిటీలు కొనుగోలు చేయడం మనకు తెలిసిందే. తెలుగు సినిమా రంగంలో ఒకప్పుడు ఎన్టీఆర్ దగ్గర హైదరాబాద్ లోనే అత్యంత పొడవైన కుక్క ఉండేది. కానీ కొన్నాళ్ళు తర్వాత చచ్చిపోయింది. ఇక చరణ్, పూరి జగన్నాథ్ దగ్గర రకరకాల జాతుల కుక్కలు ఉంటాయి. వీటి ధరలు లక్షలలో ఉంటాయి.

అయితే ఓ ప్రముఖ నటుడు ఇటీవల 20 కోట్లు పెట్టి ప్రపంచంలోనే అరుదైన జాతికి చెందిన కుక్కను కొనుగోలు చేశాడు. వివరలోకే వెళ్తే బెంగళూరుకి చెందిన సతీష్ అనే వ్యక్తి ఖరీదైన కుక్కను కొన్నాడు. ఈయన నటుడు మరియు ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. ఎప్పటికప్పుడు అరుదైన జాతులు కలిగిన కుక్కలు కొంటూ వార్తలు నిలుస్తూ ఉంటాడు. లేటెస్ట్ గా ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాకేసియన్ షెపర్డ్ అనే జాతి కుక్కని ఈయన కొనుగోలు చేశారు. ఇవి టర్కీ, ఆర్మేనియా, సర్కాసియా, జార్జియా దేశాల్లో దొరుకుతాయి. ఇండియాలో చాలా అరుదుగా ఉంటాయి. కాపలా కోసం వీటిని ఉపయోగిస్తారు. ఇలాంటి అరుదైన జాతికి చెందిన కుక్కల్ని కొంటూ సతీష్ సెలబ్రిటీ అయిపోయారు.

bangalore man bought expensive dog

bangalore man bought expensive dog

దీని లైఫ్ టైం పీరియడ్ 10 నుంచి 12 సంవత్సరాలు మాత్రమే బతుకుతుంది. దీని శరీరంపై బొచ్చు ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో చాలామంది తమ ఆస్తుల రక్షణ కోసం వీటిని వాడుతుంటారు. కాకేసియన్ షెపర్డ్ శునకాలు తమ యజమానులకు ఎంతో నమ్మకంగా ఉంటాయి. దొంగలు మరియు తోడేలు నుంచి రక్షిస్తాయి. ఈ క్రమంలో నటుడు సతీష్ ఏడాదిన్నర వయసున్న ఈ కుక్కకి కడబామ్ హెడర్ అనే పేరు పెట్టాడు. ఇటీవల కొన్ని కుక్కల కాంపిటేషన్లలో పాల్గొని 32 కి పైగా మెడల్స్ కడబామ్ హెడర్ గెలుచుకోవటం విశేషం. ఇక ఇదే సమయంలో సతీష్ దగ్గర ఇదే జాతికి చెందిన రెండు కుక్కపిల్లలు ఉన్నాయి. వీటిని పరిచయం చేయడానికి కూడా సతీష్ రెడీ అవుతున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by S Sathish (@satishcadaboms)

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది