Banks loans Interest Rates : లోన్స్ వడ్డీ రేట్లను పెంచేసిన బ్యాకులు.. ఏ బ్యాంకు ఎంత పెంచిందంటే..
Banks loans Interest Rates : ద్రవ్యోల్బణం ఒత్తిడిని ఎదుర్కునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రేపోరేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా బ్యాంకులు రుణాల వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీకున్నాయి. దీంతో ఖాతాదారులు హోమ్ లోన్స్, వెహికిల్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఈఎంఐలు వంటివి మరింత భారం కానున్నాయి. అయితే రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకులు ప్రకటించడం ఓకే కానీ.. డిపాజిట్లపై వడ్డీ పెంపును మాత్రం మరిచాయి. అయితే తాజాగా ఆర్బీఐ రేపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ ప్రకటించింది.
దీంతో దేశంలో ప్రముఖ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, ఎచ్డీఎఫ్సీ బ్యాంక్ లు రుణాల వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం రేపోరేటు 4.90 శాతం ఉంది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ రుణ రేటును 8.10 శాతం నుంచి 8.60 శాతానికి పెంచింది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ రేపో లింక్డ్ లెండింగ్ రేటు 6.90 నుంచి 7.40 కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రిటైల్ లోన్లపై రేపో లింక్డ్ లెండింగ్ రేటు 7.40 శాతానికి పెంచింది.
అలాగే హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు 7.40 నుంచి 8.75 శాతంగా ఉన్నాయి. అలాగే వెహికిల్స్ లోన్ రేట్లు 7.90 శాతంగా ఉంది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపోరేటు 7.75 శాతం పెంచినట్లు ప్రకటించింది. అలాగే ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 7.25 శాతంగా ఉన్న ఆర్ బీ ఎల్ ఆర్ ను 50 బేసిస్ పాయింట్లను పెంచి రేపో రేటు 7.75 శాతం పెంచినట్లు ప్రకటిచింది. అలాగే ఎచ్ డీఎఫ్ సీ బ్యాంక్ హోమ్ లోన్స్ కి సంబందించి రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్లను .50 శాతం పెంచింది. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆర్ ఎల్ ఎల్ ఆర్ ను 7.75 శాతానికి పెంచింది. కాగా కెనరా బ్యాంక్ ఎంసీఎల్ ఆర్ ను 7.35 శాతం నుంచి 7.40 కి పెంచుతున్నట్లు ప్రకటించింది.