Beer : చల్లగా బీర్ వేస్తే వచ్చే కిక్ వేరే.. అదీసమ్మర్ లో.. ఎండలు భగ్గుమంటున్న సమయంలో చల్లగా బీర్ వేద్దామని అంతా అనుకుంటారు. ఇక మద్యం ప్రియులు అయితే మందు తాగే వారు కూడా ఎండాకాలంలో బీర్ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంతగా ఎండాకాలంలో బీర్ ల అమ్మకాలు జరుగుతుంటాయి. మొన్నటి మార్చి నెలలోనే 48,71, 668 కేసుల బీర్ల విక్రయాలతో ఎక్సైజ్ శాఖకు రూ.1458 కోట్ల రాబడి వచ్చింది. దీన్ని బట్టి బీర్లు ఏ రేంజ్ లో అమ్ముడు పోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏప్రిల్, మేనెలలో ఈ అమ్మకాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి.
కానీ ఈ రెండు నెలల్లో బీర్ల విక్రయాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎందుకంటే దానికి కారణం భూగర్బ జలాలు అడగంటిపోవడమే. ఇప్పుడు ఎండాకాలంలో తెలంగాణలో పల్లెలు, పట్టణాలు అనే తేడాలు లేకుండా అన్ని చోట్ల నీటి ఎద్దడి ఉన్నది. తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. అయితే బీర్ల తయారు చేయడానికి లక్షల లీటర్ల నీల్లు అవసరపడుతాయి. ఇప్పుడు ప్రజలే తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇక బీర్ల కంపెనీలకు ఎలా ఇస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అధికారులకు.
దాంతో బీర్ల తయారీ కంపెనీలకు త్వరలోనే షాక్ తప్పదని అంటున్నారు. హైదరాబాద్‌లోని బీర్ల తయారీ కంపెనీలకు రోజుకు 44 లక్షల లీటర్ల నీళ్ల వినియోగం ఉంటుంది. అయితే ఇప్పుడున్న డిమాండ్ కు తగ్గట్టే నీళ్లను సప్లై చేయలేని పరిస్థితి తలెత్తుతోంది. బీర్ల తయారీ కంపెనీలకు ఇప్పటికే నీటి కేటాయింపులు తగ్గిస్తున్నారు అధికారులు. 1999 తర్వాత తొలిసారిగా బీర్ల తయారీపై ఎఫెక్ట్ పడింది. బీర్ల కొరతతో రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు బీర్ల తయారు చేసే బ్రూవరీ కంపెనీలకు సింగూరు, మంజీరా జలాశయాల నీటిని సప్లై చేసేవారు.
కానీ ఇప్పుడు సింగూరు ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లు సరిపోవట్లేదు. దాంతో ఈ నీటిని హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న బ్రూవరీ కంపెనీలకు తరలించడం తగ్గిస్తున్నారు. ఇటు హైదరాబాద్ లోనే గత మార్చి నెలలోనే దాదాపు 1.68లక్షల ట్యాంకర్ల నీటిని జలమండలి సరఫరా చేసిందంటే నీటి కొరత ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి బీర్ల ప్రియులకు షాక్ తప్పదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.