Plums Benefits: రేగు పళ్లతో వెయిట్ లాస్ ప్లస్.. బోలెడు బెన్‌ఫిట్స్..
Plums Benefits: ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ ఒక్కరు సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. ఈ క్రమంలోనే అందరూ ఆయా సీజన్స్‌లో లభించే ఫ్రూట్స్ తీసుకుంటుంటారు. అలా ప్రతీ ఒక్కరు తీసుకోవాల్సిన ఫ్రూట్స్‌లో రేగు పళ్లు కంపల్సరీగా ఉంటాయి. రేగుపళ్లు తీసుకోవడం వలన హెల్త్ కు కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా అందుతాయి.రేగుపళ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకునేందుకుగాను మొగ్గు చూపారు. అలా అందరూ తీసుకోవాల్సిన ప్రూట్స్‌లో రేగుపళ్లుంటాయి.ఇందులో ఉండేటువంటి ప్రోటీన్, ఫైబర్ హ్యూమన్ బాడీకి కావల్సిన పోషకాలను అందిస్తుంది.
ఫలితంగా మీరు వెయిట్ లాస్ అయ్యే చాన్సెస్ కూడా ఉంటాయి.రేగుపళ్లల ఉండే న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ వలన మెమొరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. శరీరంలోని రక్తపోటును నియంత్రించడంలోనూ రేగుపళ్లలోని విటమిన్స్ తోడ్పడుతాయి. రేగుపళ్లలో ఉండే ప్రోటీన్స్, బెటులినిక్ యాసిడ్ హెల్త్‌కు చాలా మంచివి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. రేగుపళ్లలో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్ దీర్ఘకాలిక మలబద్ధకాన్ని నివారించడంలో సాయపడుతుంది. హ్యూమన్ డైజేషన్ సిస్టమ్‌ను స్ట్రాంగ్ చేయడంలోనూ రేగు పళ్లు సాయపడతాయి.రేగుపళ్లలో ఉండే బ్రోమెలైన్ అనే స్పెషల్ ఎంజైమ్ శ్వాసకోశ సమస్యలను పరిష్కరిస్తుంది.
Plums Benefits: విటమిన్స్ భాండాగారం రేగు పళ్లు..
ఇది కఫం, శ్లేష్మం ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. సైనస్ కావిటీలను క్లియర్ చేయడంలో రేగుపళ్లు సాయపడతాయి. రేగుపళ్లలోని మాంగనీస్, మెగ్నిషియం, పొటాషియం, కాపర్ వంటి మినరల్స్ హ్యూమన్ బోన్స్‌ను స్ట్రాంగ్ చేస్తాయి. రక్తాన్ని డిటాక్సిఫై చేయడంతో పాటు కేన్సర్ నివారణలోనూ రేగుపళ్లు సాయపడతాయి. రేగు గుజ్జులో మానవుడికి ప్రయోజనాలు చేకూర్చే వివిధ రకాల ట్రైటెర్పినిక్ యాసిడ్స్ ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. బ్లడ్‌లో ఉండే హార్మ్ ఫుల్ టాక్సిన్స్ క్లియర్ చేయడంతో పాటు బ్లడ్‌ను టోన్ చేయడంలో రేగు పళ్లు సాయపడతాయి. రేగుపళ్లు యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గానూ ఉపయోగపడతాయి. రేగుపళ్లలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడతాయి.