
#image_title
Best Features | ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఊపేస్తున్న షావోమీ మరోసారి యాపిల్‌కు గట్టి పోటీగా నిలిచేందుకు సిద్దమైంది. అత్యాధునిక ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్‌తో షావోమీ తాజాగా Xiaomi 17 Pro మరియు 17 Pro Max స్మార్ట్‌ఫోన్లను చైనా మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. యాపిల్ ఐఫోన్‌లకు సమానమైన స్పెసిఫికేషన్లతో పాటు, తక్కువ ధరలో లభించడంతో వినియోగదారుల్లో పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తోంది.
#image_title
ప్రో సెగ్మెంట్‌లో షావోమీ అదరగొట్టింది
షావోమీ 17 సిరీస్ ఫోన్లు ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫీచర్లతో వస్తుండటంతో, టెక్ ఎక్స్‌పర్ట్స్ కూడా వాటిని “ఐఫోన్ కిల్లర్”గా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా ప్రాసెసర్, కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యం వంటి అన్ని విభాగాల్లోనూ ఈ ఫోన్లు అద్భుతంగా డిజైన్ చేయబడ్డాయి.
షావోమీ 17 ప్రో, ప్రో మ్యాక్స్ రెండు మోడళ్లలోనూ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండటంతో గేమింగ్, మల్టీటాస్కింగ్, ఏఐ, ఫోటోగ్రఫీ వంటి అన్ని యాప్‌లలోనూ అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
దుమ్మురేపే డిస్‌ప్లే ఫీచర్లు
17 ప్రో: 6.3 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, 1Hz-120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 12-bit కలర్ డెప్త్, 3,500 నిట్స్ బ్రైట్‌నెస్.
17 ప్రో మ్యాక్స్: 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేతో అదే ఫీచర్లు.
రెండు మోడళ్లకూ షావోమీ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ రక్షణ.
వెనుక భాగంలో ఫుల్-విడ్త్ సెకండరీ డిస్‌ప్లే – సెల్ఫీలు, నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్, గేమింగ్ కోసం ప్రత్యేకంగా.
లైకా లెన్స్ కెమెరా సెటప్
50MP మెయిన్ కెమెరా – లైకా సుమ్మిలక్స్ లెన్స్‌తో.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), డైనమిక్ రేంజ్, పెరిస్కోప్ టెలిఫోటో (5x జూమ్), అల్ట్రా వైడ్.
50MP సెల్ఫీ కెమెరా – ఫ్రంట్ మరియు రియర్ రెండు ఫోన్లకూ.
బ్యాటరీ – లాంగ్ లాస్టింగ్ + ఫాస్ట్ ఛార్జింగ్
17 ప్రో: 6300mAh బ్యాటరీ.
17 ప్రో మ్యాక్స్: 7500mAh బ్యాటరీ.
100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్.
సర్జ్ G2 చిప్ – బ్యాటరీ నిర్వహణ కోసం.
వాటర్, డస్ట్ ప్రొటెక్షన్
IP68 రేటింగ్.
17 ప్రో: 4 మీటర్ల లోతు వరకూ నీటిని తట్టుకోగలదు.
17 ప్రో మ్యాక్స్: 6 మీటర్ల లోతు వరకు నీటి నిరోధకత.
ధర ఎంతంటే?
Xiaomi 17 Pro బేస్ వేరియంట్ ధర: 4,499 యువాన్ (సుమారు ₹51,000 మాత్రమే).
ఐఫోన్ ఫీచర్లతో సమానమైన మొబైల్‌ని సగం ధరకే అందించడంతో వినియోగదారులలో భారీ డిమాండ్ ఏర్పడుతోంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.