Smart TV : చాలా మంది తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అందుకోసం ఫెస్టివల్ టైంలో ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అని వెతుకుతుంటారు. అటువంటి వారికోసం రూ.10 వేలల్లోపు ధరతో మంచి స్పెసిఫికేషన్స్‌తో రెండు కొత్త మోడల్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.అందులో ఒకటి ఇన్‌ఫినిక్స్ కంపెనీది కాగా, మరొకటి థామ్సన్ అల్ఫా కంపెనీ ప్రొడక్ట్ ఉంది.
ఇన్ఫినిక్స్ 32వై1, థామ్సన్ అల్ఫా స్మార్ట్ టీవీలు రూ.10వేలలోపు రేంజ్‌లో ఇటీవలే లాంచ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలకు సంబంధించిన ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ముందుగా ఇన్ఫినిక్స్ 32వై1 స్మార్ట్ టీవీ ధర విషయానికొస్తే రూ.8,999గా ఉంది.ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్ల ద్వారా 10శాతం అదనంగా డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది. 32 ఇంచుల HD LED డిస్‌ప్లేను ఇన్ఫినిక్స్ 32వై1 స్మార్ట్ టీవీ కలిగి ఉంది. 250 నిట్స్ పీ క్‌బ్రైట్‌నెస్, HGL ఫార్మాట్‌కు సపోర్ట్ చేస్తుంది. బెజిల్‌లెస్ డిజైన్‌ను ఈ టీవీ కలిగి ఉంది. క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీలో ఉంటుంది. 512ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఈ టీవీ కలిగి ఉంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది.
డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే 20వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు ఇందులో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, జీ5 లాంటి మరికొన్ని ఓటీటీ యాప్స్ ప్రీలోడెడ్‌గా ఉంటాయి. అయితే నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లకు ఈ టీవీ సపోర్ట్ చేయదు. థామ్సన్ అల్ఫా స్మార్ట్ టీవీ ధర విషయానికొస్తే రూ.9,999గా ఉంది. ఇది కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్ కార్డ్‌లతో కొంటే అదనంగా 10శాతం తగ్గింపు దక్కుతుంది. 32 ఇంచుల HD రెజల్యూషన్ LED డిస్‌ప్లేతో థామ్సన్ ఆల్ఫా స్మార్ట్ టీవీ వస్తోంది. 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, బెజిల్‌లెస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.4జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ ఉంది. అమ్లాజికల్ ప్రాసెసర్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ5తో పాటు చాలా ఓటీటీ యాప్స్‌తో ఈ స్మార్ట్ టీవీ వస్తోంది.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.