Best Smart TV : రూ.10వేల‌లోపే బెస్ట్ స్మార్ట్ టీవీలు మీకోసం.. అదిరిపోయే ఫీచర్స్ వీటి సొంతం!

Authored By aruna | The Telugu News | Published on: August 12, 2022, 9:00 pm

Smart TV : చాలా మంది తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అందుకోసం ఫెస్టివల్ టైంలో ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అని వెతుకుతుంటారు. అటువంటి వారికోసం రూ.10 వేలల్లోపు ధరతో మంచి స్పెసిఫికేషన్స్‌తో రెండు కొత్త మోడల్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.అందులో ఒకటి ఇన్‌ఫినిక్స్ కంపెనీది కాగా, మరొకటి థామ్సన్ అల్ఫా కంపెనీ ప్రొడక్ట్ ఉంది.

Smart TV : రూ.10వేలల్లో 32 ఇంచుల బెస్ట్ స్మార్ట్ టీవీస్..

ఇన్ఫినిక్స్ 32వై1, థామ్సన్ అల్ఫా స్మార్ట్ టీవీలు రూ.10వేలలోపు రేంజ్‌లో ఇటీవలే లాంచ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలకు సంబంధించిన ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ముందుగా ఇన్ఫినిక్స్ 32వై1 స్మార్ట్ టీవీ ధర విషయానికొస్తే రూ.8,999గా ఉంది.ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్ల ద్వారా 10శాతం అదనంగా డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది. 32 ఇంచుల HD LED డిస్‌ప్లేను ఇన్ఫినిక్స్ 32వై1 స్మార్ట్ టీవీ కలిగి ఉంది. 250 నిట్స్ పీ క్‌బ్రైట్‌నెస్, HGL ఫార్మాట్‌కు సపోర్ట్ చేస్తుంది. బెజిల్‌లెస్ డిజైన్‌ను ఈ టీవీ కలిగి ఉంది. క్వాడ్‌‌కోర్ ప్రాసెసర్‌‌ ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీలో ఉంటుంది. 512ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఈ టీవీ కలిగి ఉంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‍పై రన్ అవుతుంది.

Best Smart TV under Rs.10 thousand

Best Smart TV under Rs.10 thousand

డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే 20వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు ఇందులో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీలివ్, జీ5 లాంటి మరికొన్ని ఓటీటీ యాప్స్ ప్రీలోడెడ్‌గా ఉంటాయి. అయితే నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లకు ఈ టీవీ సపోర్ట్ చేయదు. థామ్సన్ అల్ఫా స్మార్ట్ టీవీ ధర విషయానికొస్తే రూ.9,999గా ఉంది. ఇది కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్ కార్డ్‌లతో కొంటే అదనంగా 10శాతం తగ్గింపు దక్కుతుంది. 32 ఇంచుల HD రెజల్యూషన్ LED డిస్‌ప్లేతో థామ్సన్ ఆల్ఫా స్మార్ట్ టీవీ వస్తోంది. 400 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్, బెజిల్‌లెస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.4జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌ ఉంది. అమ్లాజికల్ ప్రాసెసర్‌, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జీ5తో పాటు చాలా ఓటీటీ యాప్స్‌తో ఈ స్మార్ట్ టీవీ వస్తోంది.

aruna

No bio available for this author.

  1. "Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించ‌ని భారీ ట్విస్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యిది కంటెస్టెంట్..!"

  2. "Jabardasth Faima Pregnancy : జబర్దస్త్ ఫైమా ప్రెగ్నెన్సీ వార్తలో ట్విస్ట్.. నెటిజన్ల ఫైర్ అస‌లేం జ‌రిగిందంటే..?"

  3. "Bigg Boss Telugu 10 : అతను చాలా మంచివాడు.. ఓటేసి గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి వీడియో వైరల్..!"

  4. "Jio Plan : గుడ్‌న్యూస్‌.. జియోలో రూ.123కే రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ, 14GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!"

  5. "Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 47 రైళ్ల టికెట్ ధరలు తగ్గింపు"

  6. "Scene Movie Review : సీన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  7. "Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల పథకం వారికే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp