Big Breaking resignations started in telangana congress
Big Breaking : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత.. సీనియర్ కాంగ్రెస్ నేతలు.. అధిష్టానం నిర్ణయాల పట్ల తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్లు బట్టి విక్రమార్క ఇంటిలో సమావేశమయ్యి.. పీసీసీ కమిటీల ఏర్పాటుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.
అంతేకాకుండా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై అసత్య ప్రచారం కూడా చేస్తున్నట్లు దాని వెనకాల కూట్ర దాగి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పార్టీలో ఎప్పటినుండో ఉంటున్నా గాని కనీసం క్యాడర్ కి న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు వలస వచ్చిన నాయకులకు పదవులు
Big Breaking resignations started in telangana congress
ఇస్తున్నారని సీనియర్ల ఆరోపణలతో టిడిపి నుంచి వచ్చిన నాయకులు రాజీనామా బాట పట్టారు. వేం నరేందర్ రెడ్డి, సీతక్క, ఎర్ర శేఖర్, చారుగొండ సహా పలువురు నేతలు రాజీనామా చేశారు. మొత్తం 13 మంది సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తూ మాణిక్యం ఠాగూర్ కి లేక పంపడం జరిగింది. ఇదిలా ఉంటే రాజీనామాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. నిన్న సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వర్గం ఒక్కసారిగా ఈ రీతిగా రాజీనామాలు చేయటం సంచలనంగా మారింది. ఇన్నాళ్లు అంతర్గతంగా జరిగిన ఈ గొడవలు ఇప్పుడు బయటపడటంతో.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది.
బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…
Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంటలలో సుధీర్-రష్మీ గౌతమ్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…
Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…
Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…
Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
Morning or night shower : ఇది మనలో చాలా మందికి రోజువారీ ఆచారం. ఉదయం స్నానం లేదా రాత్రి…
This website uses cookies.