Big News : బిగ్ న్యూస్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన ఇండియన్ “గే” జంట.. “మే”లో డెలివరీ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Big News : బిగ్ న్యూస్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన ఇండియన్ “గే” జంట.. “మే”లో డెలివరీ..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :9 January 2023,5:00 pm

Big News : గత ఏడాది న్యూ జెర్సీలో అమిత్ షా-ఆదిత్య ఇద్దరూ వివాహం చేసుకోవడం తెలిసిందే. 2019లో వీరి వివాహం సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. గుజరాత్ అమెరికన్ అయిన అమిత్… ఢిల్లీకి చెందిన ఆదిత్య 2016లో ఓ పెళ్లి వేడుకలో కలుసుకోవడం జరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి మూడు సంవత్సరాలు ప్రేమించుకుని 2019లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో అమెరికాలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఓ సంచలన ప్రకటన చేశారు. తామిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నట్లు.. ప్రకటించారు.

అంతేకాదు వచ్చే “మే” నెలలోనే బిడ్డకు జన్మనిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ వార్త వైరల్ అయింది. అయితే వీరిద్దరూ మగవాళ్ళు కావటంతో బిడ్డకు జన్మనివ్వడం ఎలా అనే డౌట్.. పుట్టుకు రావటం సర్వసాధారణం. విషయంలోకి వెళ్తే గత కొంతకాలంగా వీరిద్దరూ తమ బిడ్డలకు సంబంధించి అనేక అధ్యయనాలు చేయడం జరిగింది. కృత్రిమ గర్భధారణ వంటి వాటిపై చాలానే అధ్యయనాలు చేశారు. అండం దానం చేసే వారి కోసం కూడా చాలానే ప్రయత్నాలు చేశారు.

Big News on gay c0uple expecting their first baby

Big News on gay c0uple expecting their first baby

అయితే ఇప్పుడు ఒక డోనర్ ముందుకు రావడంతో.. వీరి కలను సొంతం చేసుకుంటున్నారు. IVF ద్వారా వారి డ్రీమ్ నిజమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా గర్భధారణ సంబంధించి.. స్కానింగ్ రిపోర్ట్ లు పోస్ట్ చేసి తమ ఫాలోవర్స్ కి తెలియజేయడం జరిగింది. అమిత్ చెప్పుకొచ్చాడు. ఆదిత్య మాట్లాడుతూ.. “మేము స్వలింగ సంపర్క తల్లిదండ్రులుగా ఉండము. మేం కేవలం తల్లిదండ్రులుగా మాత్రమే ఉంటాం” అంటూ మీరు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. దీంతో చాలామంది నెటీజన్స్ మీ నుండి ఇటువంటి శుభవార్త కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్యులేషన్స్ అని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది