
#image_title
Bitter gourd leaves | కాకరకాయ చేదుగా ఉన్నా కూడా దీనికి ఉన్న ఔషధ గుణాలు అనేకం. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది సహాయకారి. వంటలో కాకరకాయను వినియోగించడం అందరికీ తెలిసిన విషయమే కానీ, దీని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
#image_title
ఎన్నో ఉపయోగాలు..
ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా ప్రకారం, కాకరకాయ ఆకుల్లో ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ప్రతిరోజూ కాకర ఆకుల రసం తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు కడుపు శుభ్రపడుతుంది.
అదనంగా, కాకర ఆకులు ఐరన్, ఫోలిక్ యాసిడ్‌ను అందిస్తాయి. ఇవి హిమోగ్లోబిన్‌ను పెంచి రక్తహీనత సమస్యలను తగ్గించడంలో దోహదం చేస్తాయి. ఆకులను రసం చేసి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం లేదా పచ్చిగా నమలడం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే లో షుగర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కాకరకాయ ఆకులు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు :
* షుగర్ లెవెల్స్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.
* డాక్టర్ సూచించిన మందులు లేదా ఇన్సులిన్‌ను కొనసాగించాలి.
* ఆహారం, వ్యాయామం, యోగా, ప్రాణాయామం అలవాటు చేసుకోవాలి.
* ఒత్తిడిని నియంత్రించుకోవడం ద్వారా మధుమేహాన్ని సమర్థంగా కంట్రోల్ చేయవచ్చు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.