Bitter gourd leaves | మధుమేహ నియంత్రణలో సహాయపడే కాకరకాయ ఆకులు.. ప‌చ్చిగా న‌మిలితే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bitter gourd leaves | మధుమేహ నియంత్రణలో సహాయపడే కాకరకాయ ఆకులు.. ప‌చ్చిగా న‌మిలితే..

 Authored By sandeep | The Telugu News | Updated on :5 October 2025,7:30 am

Bitter gourd leaves |  కాకరకాయ చేదుగా ఉన్నా కూడా దీనికి ఉన్న ఔషధ గుణాలు అనేకం. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది సహాయకారి. వంటలో కాకరకాయను వినియోగించడం అందరికీ తెలిసిన విషయమే కానీ, దీని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

#image_title

ఎన్నో ఉప‌యోగాలు..

ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా ప్రకారం, కాకరకాయ ఆకుల్లో ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ప్రతిరోజూ కాకర ఆకుల రసం తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు కడుపు శుభ్రపడుతుంది.

అదనంగా, కాకర ఆకులు ఐరన్, ఫోలిక్ యాసిడ్‌ను అందిస్తాయి. ఇవి హిమోగ్లోబిన్‌ను పెంచి రక్తహీనత సమస్యలను తగ్గించడంలో దోహదం చేస్తాయి. ఆకులను రసం చేసి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం లేదా పచ్చిగా నమలడం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే లో షుగర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కాకరకాయ ఆకులు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు :

* షుగర్ లెవెల్స్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.
* డాక్టర్ సూచించిన మందులు లేదా ఇన్సులిన్‌ను కొనసాగించాలి.
* ఆహారం, వ్యాయామం, యోగా, ప్రాణాయామం అలవాటు చేసుకోవాలి.
* ఒత్తిడిని నియంత్రించుకోవడం ద్వారా మధుమేహాన్ని సమర్థంగా కంట్రోల్ చేయవచ్చు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది