TBJP: తెలంగాణలో మేమే తోపులం అని అనుకుంటున్న బీజేపీకి బిగ్ షాక్.. ఆ సీటు పోయినట్టే ఇక?
తెలంగాణలో బీజేపీ పార్టీకి తిరుగులేదు అని అనుకున్నాం. నిజంగానే బీజేపీ పార్టీ తెలంగాణలో అప్రతిహాతంగా గెలుస్తూ పోతోంది. దూకుడు మీదుంది. దుబ్బాక ఉపఎన్నిక నుంచి ఇప్పటి వరకు గెలుస్తూనే ఉన్నది. క్షేత్రస్థాయిలోనూ పార్టీ బలపడుతున్నది. అధికార టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించి మరీ.. ఎన్నికల్లో గెలుస్తోంది అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజలు ఇది వరకు టీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకున్నట్టే.. ఇప్పుడు బీజేపీని ఓన్ చేసుకుంటున్నారు.
అంతవరకు బాగానే ఉన్నది కానీ.. తాజాగా బీజేపీ పార్టీకి తెలంగాణలో ఓ ఎదురుదెబ్బ తగిలింది. దానికి కారణం అఫ్ కోర్స్ టీఆర్ఎస్ పార్టీనే. బీజేపీని నిలువరించడానికి టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. బీజేపీ ఎక్కడ దొరికితే అక్కడ ఒత్తేయడానికి తెగ ప్రణాళికలు రచిస్తోంది.
బీజేపీ కార్పొరేటర్ ఎన్నిక చెల్లదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి ఫిర్యాదు
మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి డేరంగుల వెంకటేశ్ ఎన్నిక చెల్లదని… టీఆర్ఎస్ అభ్యర్థి కాజా సూర్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. డేరంగుల వెంకటేశ్.. జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచాడు. కానీ.. ఆయన ఎన్నిక చెల్లదని.. అదే డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన సూర్యనారాయణ అనే అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశాడు.
దానికి కారణం… ఇద్దరు పిల్లలకు సంబంధించిన నిబంధనను ఉల్లంఘించడమే కాకుండా… ఎన్నికల నామినేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చాడంటూ ఆయన ఆరోపించాడు. దీనికి సంబంధించిన ఫిర్యాదును ఎన్నికల ట్రిబ్యునల్ స్వీకరించి.. విచారణ చేపట్టింది. ఫిబ్రవరి 18 న విచారణకు హాజరు కావాలంటూ బీజేపీ కార్పొరేటర్ వెంకటేశ్ కు నోటీసులు జారీ చేసింది.
ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలనే పిటిషన్ దాఖలు?
అయితే.. బీజేపీ కార్పొరేటర్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకొని బీజేపీకి ఒక కార్పొరేటర్ ను తక్కువ చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ఆరోపణలు అంటూ బీజేపీ తిప్పికొట్టినా.. ఆయనకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని.. తన నాలుగో కూతురు బర్త్ సర్టిఫికెట్ ను కూడా వెంకటేశ్ ఫోర్జరీ చేశారంటూ సూర్యనారాయణ ఆధారాలు సమర్పించారు. అయితే.. కేసు విచారణను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ ఎన్నికల ట్రిబ్యునల్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.