Munugodu BJP : మునుగోడులో బీజేపీ కొత్త వ్యూహం.. తెలంగాణ ప్రభుత్వంపై చార్జ్ షీట్.. వర్కవుట్ అవుతుందా?
Munugodu BJP : మునుగోడు ఉపఎన్నికలో పోటీ కేవలం అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీ మధ్యనేనా. ఈ ఎన్నికను కేవలం బీజేపీ, టీఆర్ఎస్ మాత్రమే సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఇప్పుడు ఉపఎన్నిక వస్తే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఏది ఏమైనా.. అధికార పార్టీని ఓడించేందుకు బీజేపీ మాత్రం మాస్టర్ ప్లాన్స్ వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ పార్టీ చార్జ్ షీట్ అనే కొత్త స్ట్రాటజీని మునుగోడులో అమలు చేయబోతోంది.
ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని తెగ ఆరాటపడుతోంది బీజేపీ. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ బీజేపీ ఇటీవల 16 మంది సభ్యులతో ఒక స్టీరింగ్ కమిటీని మునుగోడులో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. మునుగోడులో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను కూడా చేర్చి.. ఒక చార్జ్ షీట్ ను విడుదల చేయబోతోంది.
Munugodu BJP : ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని నిర్ణయించిన బీజేపీ
చార్జ్ షీట్ తో పాటు మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రతి గ్రామంలో పాదయాత్ర చేపట్టాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. అందుకే.. ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి బీజేపీ ఇంచార్జ్ లను నియమించింది. చార్జ్ షీట్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన హామీలు, వాటి వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలిపేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి కూడా ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. బీజేపీ స్టీరింగ్ కమిటీ మాత్రం ఈ ఎన్నికల కోసం కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. చూద్దాం మరి.. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో?