PM Modi : ‘ఒకే ఒక్కడు’ ని దించిన మోదీ – తెలంగాణలో BRS కి చుక్కలే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PM Modi : ‘ఒకే ఒక్కడు’ ని దించిన మోదీ – తెలంగాణలో BRS కి చుక్కలే…!!

 Authored By kranthi | The Telugu News | Updated on :31 December 2022,4:20 pm

PM Modi : బీఎల్ సంతోష్ తెలుసు కదా.. ఆయన బీజేపీ నేత. కానీ.. ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి. అసలు ఏం జరిగిందంటే.. తెలంగాణలో జరిగిన బీజేపీ నాయకుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ఆయన తెలంగాణకు వచ్చి మరీ హెచ్చరించడం ఏంటి.. దేనికి నిదర్శనం అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలుస్తున్నాయి. ఫామ్ హౌస్, ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్ ను కూడా అనుమానితుడిగా భావిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సిట్ విచారణకు హాజరు కావాలంటూ బీఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేశారు అధికారులు. దీనిపై ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. దానిపై స్టే కూడా తెచ్చుకున్నారు. అయితే.. తనను కావాలని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. తనను కావాలని అప్రతిష్టపాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నాపై అవాస్తవ ప్రచారం చేస్తే, అసత్య ప్రచారం చేస్తే దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని బీఎల్ సంతోష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాపై ఆరోపణలు చేసిన వారు ముందు ముందు పర్యావసానాలు ఎదుర్కోక తప్పదు. తెలంగాణలో అధికారం మాత్రమే కాదు.. ఇక్కడ ఉన్న అవినీతి నిర్మూలించడమే బీజేపీ లక్ష్యం..

bl santhosh warning to brs party

bl santhosh warning to brs party

PM Modi : నాపై అవాస్తవ ప్రచారం చేస్తే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది

అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓవైపు బీఎల్ సంతోష్ ను తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ చేయాలని చూస్తే.. ఆయన డైరెక్ట్ గా తెలంగాణకే వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసి వెళ్లడం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే.. ఎమ్మెల్యేల ఎర కేసులో ఇప్పటికే సీబీఐ కూడా ఇన్వాల్వ్ అవబోతోంది. ఈడీ కూడా విచారిస్తోంది. ఇలా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే అది తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. చూద్దాం మరి.. బీఎల్ సంతోష్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందిస్తుందో లేదో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది