Telangana Farmers : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన రేవంత్ సర్కార్..!

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 6 March 2026, 5:20 pm
  •  Telangana Farmers : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన రేవంత్ సర్కార్..!

  •  మొక్కజొన్న రైతుల ఎదురుచూపులు తెరపడింది..పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదలకు

Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నదాతల నిరీక్షణ ఫలించింది.. తెలంగాణలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల ఖాతాల్లోకి త్వరలోనే నగదు జమ కానుంది. వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి మార్క్‌ఫెడ్ సేకరించిన ధాన్యానికి గాను చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రభుత్వం తాజాగా రూ. 171 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని నెలలుగా ఈ నిధుల విడుదల కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రాజకీయంగా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో, రానున్న రెండు మూడు రోజుల్లోనే అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ఈ సొమ్ము నేరుగా జమ అయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇది సుమారు 78,500 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది.

Telangana Farmers : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన రేవంత్ సర్కార్..!

Telangana Farmers : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన రేవంత్ సర్కార్..!

Telangana Farmers : రైతులకు గుడ్ న్యూస్..పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

వాస్తవానికి ఈ సీజన్‌లో మార్క్‌ఫెడ్ సుమారు 3.77 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించింది. దీనికి సంబంధించి తొలి విడతలో ప్రభుత్వం రూ. 735.39 కోట్లు ఇప్పటికే విడుదల చేసినప్పటికీ, మిగిలిన బకాయిలు జనవరి 17 నుండి నిలిచిపోయాయి. పంట విక్రయించి నాలుగు నెలలు గడుస్తున్నా పైసలు చేతికి అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా యాసంగి (రబీ) సీజన్ పెట్టుబడుల కోసం డబ్బులు లేక, అప్పులు దొరకక రైతులు అధికారుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. గతంలో వారం రోజుల్లోనే వచ్చే నగదు, ఈసారి నెలల తరబడి ఆలస్యం కావడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర నిరాశ వ్యక్తమైంది.

Telangana Farmers : మొక్కజొన్న రైతుల ఎదురుచూపులు తెరపడింది..పెండింగ్‌లో ఉన్న బకాయిల విడుదలకు

ప్రస్తుత నిధుల విడుదల మొక్కజొన్న రైతులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, రైతు భరోసా నిధులపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఈ నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ దానిపై స్పష్టత రాకపోవడం గమనార్హం. ఒకవైపు మొక్కజొన్న బకాయిలు విడుదలైనందుకు సంతోషిస్తున్న రైతులు, మరోవైపు పెట్టుబడి సాయం (రైతు భరోసా) ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కూడా త్వరగా స్పందించి, వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చూడాలని రైతాంగం కోరుతోంది.

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి