Brahmanandam : బ్రహ్మానందం ఒకప్పటి రెమ్యూనరేషన్‌ కి ఇప్పటి రెమ్యూనరేషన్ కి వ్యత్యాసం ఎంత?

 Authored By prabhas | The Telugu News | Updated on :9 February 2023,1:00 pm

Brahmanandam : హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇప్పుడు సినిమాలు ఎక్కువగా చేయడం లేదు, కానీ 10 సంవత్సరాల క్రితం ఆయన జోరు ఏంటో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో బ్రహ్మానందం రోజుకు రెండు మూడు సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి స్టార్ హీరో సినిమా లో కూడా బ్రహ్మానందం పాత్ర ఉండాల్సిందే. ఎంత పెద్ద హీరో సినిమా అయినా, ఎంత పెద్ద దర్శకుడి సినిమా అయినా కూడా బ్రహ్మానందం పాత్ర లేకుండా కథ ఉండేది కాదు.. స్క్రీన్ ప్లే నడిచేది కాదు. ఒకానొక సమయంలో బ్రహ్మానందం రెమ్యూనరేషన్ హీరోల స్థాయిలో ఉండేది.

Brahmanandam remuneration for his old films and new films

Brahmanandam remuneration for his old films and new films

రోజు వారి పారితోషికం తీసుకునే బ్రహ్మానందం ఒక్కొక్క సినిమాకు ఏకంగా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో రోజుకి 7 నుండి 10 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న బ్రహ్మానందం ఇప్పుడు అవకాశాలు లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఈ సమయంలో అడపాదడపా వస్తున్న సినిమా అవకాశాల కోసం రెమ్యూనరేషన్ గా బ్రహ్మానందం నాలుగు నుండి ఆరు లక్షల రూపాయలను రోజువారి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. బ్రహ్మానందం కి సినిమా ఆఫర్స్ రావడమే ఎక్కువ అన్నట్లుగా ఉన్న ఈ పరిస్థితుల్లో రెమ్యూనరేషన్ విషయంలో ఆయన డిమాండ్ చేసే పరిస్థితి అసలే లేదు.

Brahmanandam remuneration for his old films and new films

Brahmanandam remuneration for his old films and new films

ఒకప్పుడు ఆయన రెమ్యూనరేషన్ కి ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కి ఏ మాత్రం పొంతన లేదు. ఒకప్పుడు ఆయన ఉన్న బిజీకి ఇప్పుడు ఆయన పరిస్థితికి అస్సలు సంబంధం లేదు అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా బ్రహ్మానందం కామెడీని ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. కానీ యంగ్ దర్శకులు బ్రహ్మానందం ని సరిగా వాడుకోలేక ప్రేక్షకుల ముందుకు సరిగ్గా తీసుకు రాలేక ఆయనతో అద్భుతమైన పాత్రలు చేయించలేక చేతులెత్తేసి పక్కకు పెట్టేస్తున్నారు. బ్రహ్మానందం ముందు ముందు అయినా మళ్లీ బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి