Brahmanandam | రాజ‌కీయాల్లోకి బ్ర‌హ్మానందం వ‌స్తారా.. పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmanandam | రాజ‌కీయాల్లోకి బ్ర‌హ్మానందం వ‌స్తారా.. పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

 Authored By sandeep | The Telugu News | Updated on :13 September 2025,12:00 pm

Brahmanandam | ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన జీవిత ప్రస్థానాన్ని ‘ME and मैं’ పేరుతో పుస్త‌క రూపంలో మార్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించ‌గా, ఇందులో తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలను, అనుభవాలను పంచుకున్నారు. తనకు రాజకీయ నేపథ్యం లేదని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని ఆయన స్పష్టం చేశారు.

Brahmanandam సినిమాలో అవకాశం ఇవ్వరు కానీ ప్రమోషన్స్ మాత్రం చేపించుకుంటారు బ్రహ్మానందం ఫన్నీ కామెంట్స్

 

“నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి, నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఇప్పటివరకు 1200 చిత్రాల్లో నటించానంటే అది నటరాజ స్వామి ఆశీర్వాదం, ప్రేక్షకుల అభిమానం వల్లే సాధ్యమైంది” అని బ్రహ్మానందం తెలిపారు. తన జీవితం సినిమాలకే అంకితమని, నటనను ఎప్పటికీ వీడనని ఆయన అన్నారు. “నా పదవికి రిటైర్మెంట్ ఇవ్వొచ్చేమో గానీ.. నా పెదవికి ఇవ్వలేను. చివరి వరకు నవ్విస్తూనే ఉంటాను” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

కష్టపడి పనిచేస్తే విజయం కచ్చితంగా వరిస్తుందని, ఈ విషయంలో వెంకయ్య నాయుడు తనకు ఎంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్ గురించి ప్రస్తావిస్తూ, “నన్ను కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా ‘మీమ్స్ బాయ్’గా మార్చారు. ఏ రూపంలోనైనా సరే పదిమందినీ నవ్వించడమే నా ప్రధాన లక్ష్యం” అని బ్రహ్మానందం అన్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది