BSNL | బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్లు .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా బెనిఫిట్స్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BSNL | బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్లు .. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా బెనిఫిట్స్!

 Authored By sandeep | The Telugu News | Updated on :14 October 2025,6:00 pm

BSNL | దేశీయ టెలికాం రంగంలో మరోసారి బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ రేట్లను పెంచుతున్న తరుణంలో, తక్కువ ధరలకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తూ బీఎస్ఎన్ఎల్ యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన 4G సేవలను విస్తరిస్తూ, భవిష్యత్‌లో 5G నెట్‌వర్క్‌ను అందించేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ, ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్లతో మరిన్ని కొత్త కస్టమర్లను సంపాదిస్తోంది.

#image_title

రూ.99 ప్లాన్.. తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్స్

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ₹99 ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు బడ్జెట్‌లో బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఈ ప్లాన్‌కు 15 రోజుల వ్యాలిడిటీ ఉంది. కేవలం రూ.198కు రెండు సార్లు రీఛార్జ్ చేసుకుంటే నెలపాటు ఉపయోగించుకోవచ్చు.

అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కైనా)

50MB హై స్పీడ్ డేటా

తర్వాత స్పీడ్ 40Kbpsకి తగ్గినా, డేటా వాడకం కొనసాగుతుంది

ఇది తక్కువ డేటా వాడే, ఎక్కువగా కాల్స్ చేసే యూజర్లకు సరైన ఎంపికగా నిలుస్తోంది.

రూ.229 ప్లాన్ — డేటా యూజర్లకు బెస్ట్ ఆఫర్

ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ కావాలనుకునే వారికి బీఎస్ఎన్ఎల్ ₹229 ప్రీపెయిడ్ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.

రోజుకు 2GB హై స్పీడ్ డేటా

అన్‌లిమిటెడ్ కాల్స్

రోజుకి 100 ఉచిత SMSలు

30 రోజుల వ్యాలిడిటీ

డేటా లిమిట్ పూర్తయిన తర్వాత కూడా 40Kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ వినియోగం కొనసాగుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది