BSNL | బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక ఆఫర్: రూ.1,999 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌పై అక్టోబర్ 15 వరకు 2% డిస్కౌంట్
BSNL | ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తన వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొస్తోంది. తాజాగా, స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన 4G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించిన బీఎస్‌ఎన్‌ఎల్, త్వరలో 5G సేవలు కూడా అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షకు పైగా కొత్త 4G టవర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం.
#image_title
ఈ నేపథ్యంలో, బీఎస్‌ఎన్‌ఎల్ తన వార్షిక రీఛార్జ్ ప్లాన్ అయిన రూ.1,999 లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌పై స్పెషల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్ 15 వరకు ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
రూ.1,999 ప్లాన్ డిటైల్స్:
వాలిడిటీ: 330 రోజులు
డేటా: రోజుకు 1.5GB (మొత్తం 495GB)
కాల్ బెనిఫిట్స్: ఉచిత అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (నేషనల్ రోమింగ్ సహా)
SMS: రోజుకు 100 ఉచిత SMSలు
ఓటీటీ సేవలు: BiTV ఫ్రీ యాక్సెస్ (350+ లైవ్ టీవీ ఛానెల్స్, పలు OTT యాప్స్)
ప్రత్యేక డిస్కౌంట్: అక్టోబర్ 15 లోపు రీఛార్జ్ చేస్తే 2% ఇన్‌స్టంట్ డిస్కౌంట్
ఎలా పొందాలి?
ఈ ప్లాన్‌పై 2% డిస్కౌంట్ పొందాలంటే వినియోగదారులు BSNL అధికారిక వెబ్‌సైట్ లేదా BSNL సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా తమ నంబర్‌ను ఉపయోగించి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.