Avinash Reddy : బిగ్ బ్రేకింగ్ : అవినాష్ రెడ్డిని అరస్ట్ చేయడానికి సిబిఐ చూపిస్తోన్న కారణం ఇదే !
Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజురోజుకో మలుపు తిరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడు అంటూ ఈ కేసుపై సీబీఐ ఆయనపై అభియోగం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం తనకు ఏ పాపం తెలియదని.. కావాలని సీబీఐ తనను ఈ కేసులో ఇరికిస్తోందని.. ఏకంగా తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అయితే.. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని సీబీఐ పేర్కొంది.
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. ఆ కౌంటరులో వివేకా హత్య దర్యాప్తుపై కీలక వివరాలు తెలిపింది. కావాలనే, దురుద్దేశంతోనే అవినాష్ రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదంటూ కౌంటర్ లో పేర్కొన్నది సీబీఐ. అసలు సమాధానాలు చెప్పడం లేదని, సమాధానాలు దాటవేస్తున్నారని.. వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. అందుకే.. అవినాష్ ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీబీఐ..
Avinash Reddy : అందుకే అవినాష్ ను అరెస్ట్ చేయబోతున్నారా?
కోర్టుకు తెలిపింది. అవినాష్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు కూడా ముందుకు రావడం లేదంటూ స్పష్టం చేసింది. ఆయనకు నేర చరిత్ర ఉందని, నాలుగు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని, సాక్షులను కూడా ప్రభావితం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని సీబీఐ కౌంటర్ లో పేర్కొన్నది. హత్యకు గురైన వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డిని, సీఐ శంకరయ్యతో పాటు మరో వ్యక్తి గంగాధర్ రెడ్డిని అవినాష్ రెడ్డి ప్రభావితం చేసినట్టు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.