Narendra Modi : ఆంధ్ర ప్రదేశ్ కి కేంద్రం బంపర్ ఆఫర్ : మోడీ నేరుగా ప్రకటించాడు !
Narendra Modi : విభజనతో ఆంధ్ర ప్రదేశ్ చాలా రకంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా ఎంతో వెనకబడిపోయింది. పార్లమెంటు సాక్షిగా స్పెషల్ స్టేటస్ కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు. స్పెషల్ ప్యాకేజ్ అనగానే అరకోరా నిధులు మంజూరు చేసినా గాని పెద్దగా రాష్ట్రానికి ఏర్పడ్డ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయలేదని చెప్పవచ్చు. దీంతో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు…
ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం మొదలుకొని పెన్షన్ ఇంకా ప్రజలకు పథకాలు వంటి వాటిపై కేంద్రం పైన ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మేటర్ లోకి వెళ్తే కేంద్రం దేశంలో కొత్త ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపాదనలు కోరింది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం కడప జిల్లా కొప్పర్తిని ప్రతిపాదించింది. 15 ఆర్థిక సంఘం కొత్త నగరాల అభివృద్ధిపై రాష్ట్రాలకు విధి విధానాలను స్పష్టం చేయడం జరిగింది.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్రం సంకల్పించింది. దీనిలో భాగంగా దేశంలో కొత్తగా నిర్మించాలని భావిస్తున్న నగరాలకు… ఒక్కో నగరానికి వెయ్యి కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టాలని కేంద్ర ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. ఈ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాల అభివృద్ధికి ప్రతి ఏటా 250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కడప జిల్లాలో కొప్పర్తి ప్రాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ప్రధాని మోడీయే దేశంలో 8 జిల్లాల అభివృద్ధికి సంబంధించి ప్రకటన చేయటం విశేషం.