
Women : మహిళల పేరుపై ఇల్లు కొనుగోలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో... కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్...!
Women : ప్రస్తుత కాలంలో చాలామంది వారి జీవితాన్ని విలాసంగా గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిలో భాగంగానే సొంత ఇల్లు సొంత కారు ఇలా కొన్ని రకాల సదుపాయాలు ఉంటే బాగుంటుందని కలలు కంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా చాలామంది మధ్యతరగతి వారికి సొంతంగా ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలామందికి సొంతంగా ఇల్లు కొనుక్కోవడం అనేది కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అయితే అసలు ఇంటిని ఎవరి పేరుతో కొనుగోలు చేయడం మంచిది..?వారి పేరు మీద ఎందుకు చేయాలి..?ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కొత్తగా ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అనుకుంటే తల్లి లేదా భార్య పేరు మీద కొనుగోలు చేయడం చాలా మంచిదని పలువురు చెబుతుంటే విన్నాం. అయితే పెద్దలు ఈ మాట ఎందుకు చెప్పారో తెలియదు కానీ ప్రస్తుత కాలంలో మహిళల పేరుపై ఆస్థి లేదా ఇల్లు కొనుగోలు చేయడం అనేక రకాల ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది. అది ఎలా అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొన్ని రకాల పథకాలు అని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే వడ్డీ తక్కువతో రుణాలను కూడా పొందవచ్చు.
అయితే మహిళల పేరుపై ఆస్తి లేదా ఇల్లును కొనుగోలు చేసినట్లయితే ప్రస్తుతం బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలను అందిస్తున్నాయి. అంతేకాక రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగినంత సమయాన్ని కూడా కేటాయిస్తారు. అంతేకాదు పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. దీనిలో భాగంగానే సాధారణ మహిళలకు 5 నుండి 10 శాతం వరకు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటున్నాయి. ఇదేవిధంగా అన్ని బ్యాంకుల్లో కూడా మహిళలకు వడ్డీరేట్లు కేటాయించబడ్డాయి.
Women : మహిళల పేరుపై ఇల్లు కొనుగోలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో… కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్…!
అలాగే మహిళలు వారి యొక్క బ్యాంకు క్రెడిట్ స్కోర్ అత్యధికంగా ఉన్నట్లయితే తక్కువ వడ్డీకే రుణాలు పొందుతారు. దీంతో తక్కువ వడ్డీ రేటు ఉన్న రుణాలు తిరిగి చెల్లించడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి అధిక వడ్డీ రేటు తో బాధ పడాల్సిన అవసరం ఉండదు. అంతేకాక ప్రస్తుతం కొన్ని రకాల సెంట్రల్ బ్యాంకులు ఇంటి కొనుగోలు కోసం ఓ పథకాన్ని కూడా కలిగి ఉన్నాయి కాబట్టి దీనిని ఉపయోగించుకోవడం వలన అతి తక్కువ వడ్డీతో రుణాలను పొందవచ్చు. కాబట్టి మహిళల పేరుపై ఆస్తి లేదా ఇళ్లను కొనుగోలు చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
This website uses cookies.