Teacher Jobs : గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం.. మొత్తం 15000 టీచర్ పోస్ట్ లు ఖాళీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Teacher Jobs : గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం.. మొత్తం 15000 టీచర్ పోస్ట్ లు ఖాళీ

 Authored By sandeep | The Telugu News | Updated on :27 July 2022,10:00 pm

Teacher Jobs : నిరుద్యోగుల‌కి కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జాబ్స్ లేక చాలా మంది నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆ స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త అందించింద‌నే చెప్పాలి. దేశంలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. 2021 నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో 12 వేలకు పైగా, నవోదయ స్కూళ్లలో 3 వేలకు పైగా టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) 9 వేల మందికి పైగా టీచర్లు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారని పేర్కొన్నది.

కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు. భారతదేశంలో మొత్తం 1,247 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాల్లో 2019లో 5,562 ఖాళీలు ఉంటే, 2020 నాటికి ఖాళీల సంఖ్య పెరిగి 8,055 కి చేరుకుంది. 2021లో ఈ ఖాళీల సంఖ్య 10,452 కి చేరగా, ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం 12,044 ఖాళీలు ఉన్నాయి. అంటే 2019 నుంచి ఖాళీల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్రీయ విద్యాలయాల్లో 12,044 టీచింగ్ పోస్టులు, 1,332 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి . వీటిలో తమిళనాడులో 1,162, మధ్యప్రదేశ్‌లో 1,066, కర్ణాటకలో 1,066 అధ్యాపక పోస్టులు భర్తీకి నోచుకోలేదు.

Central Govt said good news 15000 teacher jobs are vacant

Central Govt said good news 15000 teacher jobs are vacant

Teacher Jobs : ఎన్ని ఖాళీలంటే..

నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,156 పోస్టుల్లో జార్ఖండ్‌లో అత్యధికంగా 230 ఉన్నాయని మంత్రి చెప్పారు. బదిలీలు, పదవీ విరమణల కారణంగా ఈ ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. భర్తీ ప్రక్రియ నిరంతర‌ ప్రక్రియ అని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో 69, ఆంధ్రప్రదేశ్‌లో 106 పోస్టులున్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి ప్రకటించారు. ఉపాధ్యాయుల పదవీ విరమణతో పాటు విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం లాంటి అనేక కారణాల వల్ల ఖాళీల సంఖ్య పెరుగుతున్నట్టు తెలిపారు. బోధన, అభ్యాస ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూసేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో తాత్కాలిక కాల వ్యవధి కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల్ని భర్తీ చేస్తున్నామన్నారు.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది