Bank : బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వాటిపై పన్ను మినహాయింపు?
Bank : బ్యాంక్ ఖాతాదారులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న రిలీజ్ కానున్న యూనియన్ బడ్జెట్ (2022)కు ముందుగానే బ్యాంకులు కొన్ని డిమాండ్లను తెరమీదకు తెచ్చాయి. ఎఫ్‌డీ (ఫిక్స్‌డ్ డిపాజిట్) కాలపరిమితిని మూడేళ్లకు తగ్గించాలని.. ఫలితంగా ఎక్కువ మంది పన్ను మినహాయింపు పొందే చాన్స్ ఉందని ప్రభుత్వానికి బ్యాంకుల సంఘం విన్నవించింది.ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లోనూ పన్ను మినహాయింపు కోసం ఇదే రూల్ వర్తిస్తుంది.
ఈ డిమాండ్ ను గవర్నమెంట్ ఒప్పుకుంటే ఎఫ్ డీ లాక్ ఇన్ టైం మూడు ఏళ్లు మాత్రమే ఉండనుంది. ప్రస్తుతం ఎఫ్ డీ మెచ్యూరిటీపై పన్ను మినహాయింపు పొందాలంటే 5 ఏళ్లు తప్పనిసరిగా ఎఫ్ డీ పెట్టాలి.ఇన్‌కం ట్యాక్స్ చట్టం 1961.. సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ మినహాయింపును పొందాలి అనుకుంటే ఐదు ఏళ్ల పాటు ఎఫ్ డీ చేయాలి. దీని కింద లక్షా 50 వేల వరకు పెట్టుబడిపైన ట్యాక్స్ మినహాయింపును పొందొచ్చు. ఐబీఏ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్) బడ్జెట్ కు ముందుగానే ప్రభుత్వానికి తమ సూచనలను తెలిపింది.
Bank : సెక్షన్ 80సీ..
మరి ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకునే చాలా మందికి లాభం చేకూరుతుంది. ఇది డిపాజిటర్లను మరింతగా ఆకర్షించే చాన్స్ ఉంటుంది. ఫలితంగా డిపాజిటర్స్ సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది. మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.