జన్ ధన్ ఖాతాదారులకు అల‌ర్ట్ .. సెప్టెంబర్ 30లోగా రీ-కెవైసీ చేయకపోతే ఖాతా మూతపడే ప్రమాదం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

జన్ ధన్ ఖాతాదారులకు అల‌ర్ట్ .. సెప్టెంబర్ 30లోగా రీ-కెవైసీ చేయకపోతే ఖాతా మూతపడే ప్రమాదం!

 Authored By sandeep | The Telugu News | Updated on :30 September 2025,3:30 pm

2014-15లో ఓపెన్ చేసిన జన్ ధన్ ఖాతాలకి సంబంధించిన కీలక హెచ్చరిక జారీ అయింది. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం, 10 సంవత్సరాలు పూర్తయ్యే ఖాతాదారులకు రీ-కెవైసీ (Re-KYC) తప్పనిసరి. ఈ ప్రక్రియను 2025 సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయకపోతే, ఖాతా యాక్టివ్‌గా ఉండకపోవచ్చు, లేదా తాత్కాలికంగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.

#image_title

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల జన్ ధన్ ఖాతాలు రీ-కెవైసీ అవసరమున్నవిగా గుర్తించబడ్డాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2025 నుండి రీ-కెవైసీకి సంబంధించి ప్రచారం ప్రారంభించింది. ప్రతి అర్హుడైన పౌరుడు సులభంగా ఈ ప్రక్రియను పూర్తిచేయగలుగునట్లు పంచాయతీ స్థాయిలో కూడా సహాయం అందిస్తోంది.

రీ-కెవైసీ అంటే ఏంటి?

రీ-కెవైసీ అంటే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న పేరు, చిరునామా, ఫోటో వంటి వివరాలను అప్‌డేట్ చేయడం. ఇది చేయడం వల్ల మీ ఖాతా యాక్టివ్‌గా ఉంటుంది.బీమా, పెన్షన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT), ఓవర్‌డ్రాఫ్ట్, పొదుపు వంటి సేవలు కొనసాగుతాయి.బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు.ఈ ప్రక్రియను మీరు మీ సమీప బ్యాంకు శాఖలో లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం గడువు సెప్టెంబర్ 30, 2025గా నిర్ణయించబడింది. అయితే ప్రజల స్పందనను బట్టి గడువు పొడిగించే అవకాశముందా? లేదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఈ విషయంపై త్వరలో స్పష్టత ఇవ్వనుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది