Junior NTR : జూనియర్ ఎన్టీఆర్‌కు చంద్రబాబు, నారా లోకేశ్ నుంచి పిలుపు.. టీడీపీ పగ్గాలు ఇస్తారా?
Junior NTR : ప్రస్తుతం టీడీపీలో నాయకత్వ లేమి కనిపిస్తోంది. అవును.. పక్కాగా కనిపిస్తోంది. పార్టీకి ఇప్పుడు యువరక్తం కావాలి. కానీ.. నారా లోకేశ్ ఉన్నారు కదా. ఆయన యువరక్తమే కదా అంటే.. నారా లోకేశ్ ఇప్పటి వరకు టీడీపీలో ఉండి చేసిందేమీ లేదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయారు. అదే చంద్రబాబు అసలు భయం. తన రాజకీయ వారసుడిగా టీడీపీలోకి అడుగుపెట్టిన నారా లోకేశ్ పరిస్థితి ఏం బాగోలేదు. ఆయన మీద ఎలాంటి ఆశలు లేవు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించే నాయకుడు ఎవరు. చంద్రబాబు ఇప్పటికే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కానీ.. ఆయనకూ వయసు అయిపోయింది. ఈనేపథ్యంలో ఖచ్చితంగా పార్టీలోకి కొత్త రక్తం కావాలి. అది ఎలా ఉండాలి అంటే అచ్చం జూనియర్ ఎన్టీఆర్ లా ఉండాలి.
జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లోనే టీడీపీ తరుపున ప్రచారం చేశారు. టీడీపీ తరుపున ప్రచారం చేసి చివరకు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు ఎన్టీఆర్. అయినా కూడా ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. కట్ చేస్తే అప్పటి నుంచి ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కన పెట్టారు. అప్పటికీ నారా లోకేశ్ రాజకీయాల్లోకి రాలేదు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన కొడుకు చరిష్మా పని చేయదు అనుకున్నారో ఏమో చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ నను పక్కన పెట్టేశారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ విడిపోయాక.. ఏపీలో జరిగిన తొలి ఎన్నికల్లో ఎలాగోలా చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చారు. కానీ.. అది 5 ఏళ్లకే పరిమితం అయింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. దీంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు పడ్డారు.
Junior NTR : 2014 లో ఎలాగోలా నెట్టుకొచ్చిన చంద్రబాబు
2024 ఎన్నికల్లో మళ్లీ అదే సీన్ రిపీట్ అవుద్దని తెలుస్తోంది కానీ.. చంద్రబాబు ఏం చేయలేని పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ పార్టీలోకి వస్తే ఏదైనా మార్పు ఉండొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మాతో ఎన్నికల్లో గెలిచినా గెలిచే చాన్స్ ఉంది. అందుకే ఎన్టీఆర్ కు అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ నుంచి పిలుపు వెళ్తోందట. అయితే వాళ్లు నేరుగా కాకుండా బాలకృష్ణతో ఎన్టీఆర్ తో సంప్రదింపులు చేయిస్తున్నారట. ఒకసారి అడిగి చూస్తే పోలా అని చంద్రబాబు కూడా భావిస్తున్నారట. వస్తే ఓకే.. అది టీడీపీకే బలం.. రాకపోయినా ఓకే తన కొడుకునే ఇంకా రాటుదేలేలా చేసి 2024 కాకపోతే 2029 ఎన్నికల్లో గెలిపే వ్యూహంగా ముందుకు సాగుతా.. అని చంద్రబాబు మదిలో మెదులుతున్నట్టు తెలుస్తోంది.