YS Jagan : పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ ‘ఆ పేరు’ ఎత్తాలి అంటే వణికిపోయేలా చేసిన వైఎస్ జగన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ ‘ఆ పేరు’ ఎత్తాలి అంటే వణికిపోయేలా చేసిన వైఎస్ జగన్..!

YS Jagan : ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఎన్నికల గురించే చర్చ. సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అంతగా ఎవ్వరూ టెన్షన్ పడరు కానీ.. అసలు మునుగోడు ఉపఎన్నికలో జరుగుతున్న చిత్రాలు చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. అక్కడ ఎమ్మెల్యేల బేరసారాలు నడి రోడ్డు మీద జరుగుతున్నాయి. అది కూడా వందల కోట్లకు. ఓవైపు ఓటర్లను, మరోవైపు ప్రజాప్రతినిధులను కూడా పార్టీలు ఊరిస్తున్నాయి. తమ దారిలోకి తెచ్చుకుంటున్నాయి. అందుకే కుప్పలు కుప్పలుగా డబ్బులు కురిపిస్తున్నాయి. తాజాగా పలువురు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 November 2022,1:00 pm

YS Jagan : ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఎన్నికల గురించే చర్చ. సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అంతగా ఎవ్వరూ టెన్షన్ పడరు కానీ.. అసలు మునుగోడు ఉపఎన్నికలో జరుగుతున్న చిత్రాలు చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. అక్కడ ఎమ్మెల్యేల బేరసారాలు నడి రోడ్డు మీద జరుగుతున్నాయి. అది కూడా వందల కోట్లకు. ఓవైపు ఓటర్లను, మరోవైపు ప్రజాప్రతినిధులను కూడా పార్టీలు ఊరిస్తున్నాయి. తమ దారిలోకి తెచ్చుకుంటున్నాయి. అందుకే కుప్పలు కుప్పలుగా డబ్బులు కురిపిస్తున్నాయి.

తాజాగా పలువురు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరెత్తడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ బీజేపీ ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని బేరసారాలు జరుపుతోందని వార్తలు వస్తుంటే.. పార్టీల అధినేతలుగా వారు స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ.. పవన్, చంద్రబాబు అసలు ఆ విషయం గురించే మాట్లాడటం లేదు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్న నందకుమార్, సింహయాజులు, ఇంకో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

chandrababu and pawan kalyan are afraiding to speak about those leaders

chandrababu and pawan kalyan are afraiding to speak about those leaders

YS Jagan : ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వాళ్లను విచారిస్తున్నారు. అసలు నిజంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఇంత సీరియస్ అయిందా అంటే చెప్పడం కష్టం కానీ.. అసలు ఏ విషయం మీదనైనా మాట్లాడే ఈ ఇద్దరు నేతలు.. ఈ విషయం మీద మాత్రం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. అసలే తెలంగాణ ఇష్యూ. మనకెందుకు.. మన పార్టీలు పెద్దగా అక్కడ యాక్టివ్ గా లేవు అనే ఆలోచనా.. లేక మునుగోడు ఎన్నికల్లో తమ పార్టీల అభ్యర్థులు పోటీ చేయడం లేదనా అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఇటువంటి వ్యవహారం ఏపీలో జరిగితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేసేవాళ్లు కావచ్చు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది