ChandraBabu : కోనసీమ చిచ్చుకు ఖచ్చితంగా చంద్రబాబు కారణం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ChandraBabu : కోనసీమ చిచ్చుకు ఖచ్చితంగా చంద్రబాబు కారణం

 Authored By prabhas | The Telugu News | Updated on :25 May 2022,7:30 pm

ChandraBabu : కేరళ అందాలకు ఏమాత్రం తగ్గకుండా ఏపీలో కోనసీమ అందాలు ఉంటాయి. అలాంటి అందాల కోనసీమ లో మంటలు చెలరేగాయి. మంత్రి ఇల్లులు… ఎమ్మెల్యేల ఇల్లులపై దాడులు చేయడం మాత్రమే కాకుండా ఎప్పుడు లేనంతగా నిప్పు అంటించి మరీ దారుణంగా అక్కడి ఉద్యమ కారులు ప్రవర్తిస్తున్నారు. వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా కొందరు వ్యవహరించారు అనే విషయం పక్కన పెడితే.. వారిని మరింతగా రెచ్చగొడుతున్నది మాత్రం తెలుగు దేశం పార్టీ నాయకులు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటూ వైకాపా నాయకుడు మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు.

పచ్చటి కోనసీమలో ఇలాంటి కల్లోలం సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ది చేకూరుతుందనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ఈ పనికి తెగబడ్డాడేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజా ప్రెస్ మీట్‌ లో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై సంచలన ఆరోపణలు చేశాడు. కోనసీమ చిచ్చు వెనుక పెద్ద హస్తం ఉండి ఉంటుంది.. ఆ హస్తం చంద్రబాబు ది ఎందుకు కాకూడదు అన్నట్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. దాడిశెట్టి రాజా పలు అనుమానాలను మీడియా ముందు ఉంచాడు.మొదటి నుండి కూడా చంద్రబాబు నాయుడుకు కుట్రలు పన్నడం అనేది తెలుసు.

ChandraBabu and pawan kalyan is behind the destruction of konaseema

ChandraBabu and pawan kalyan is behind the destruction of konaseema

పక్కా ప్లాన్‌ తోనే చంద్రబాబు పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టాడు.రెండు వర్గాల్లో కూడా ఆయన పార్టీకి చెందిన వారు ఉన్నారు. చంద్రబాబు మరియు పవన్‌ లు కోనసీమలో అలజడి సృష్టించి వదిలి పెట్టారు. అక్కడి జనాలు వారి మాటలు నమ్మి ఆందోళనలు చేస్తున్నారు. అప్పట్లో తుని ఘటనకు చంద్రబాబు నాయుడు కారణం.. ఇప్పుడు కోనసీమ చిచ్చుకు కూడా ఆయనే కారణం అంటూ బల్ల గుద్ది మరీ ఆయన పేర్కొన్నాడు. రాజకీయంగా వినియోగించుకునే ఉద్దేశ్యంతోనే పవన్‌ మరియు చంద్రబాబు నాయుడు కలిసి ఈ చిచ్చు రాజేశారు అంటూ ఇంకా పలువురు వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది