ChandraBabu : కేరళ అందాలకు ఏమాత్రం తగ్గకుండా ఏపీలో కోనసీమ అందాలు ఉంటాయి. అలాంటి అందాల కోనసీమ లో మంటలు చెలరేగాయి. మంత్రి ఇల్లులు… ఎమ్మెల్యేల ఇల్లులపై దాడులు చేయడం మాత్రమే కాకుండా ఎప్పుడు లేనంతగా నిప్పు అంటించి మరీ దారుణంగా అక్కడి ఉద్యమ కారులు ప్రవర్తిస్తున్నారు. వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా కొందరు వ్యవహరించారు అనే విషయం పక్కన పెడితే.. వారిని మరింతగా రెచ్చగొడుతున్నది మాత్రం తెలుగు దేశం పార్టీ నాయకులు.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటూ వైకాపా నాయకుడు మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు.
పచ్చటి కోనసీమలో ఇలాంటి కల్లోలం సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ది చేకూరుతుందనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు ఈ పనికి తెగబడ్డాడేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజా ప్రెస్ మీట్ లో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై సంచలన ఆరోపణలు చేశాడు. కోనసీమ చిచ్చు వెనుక పెద్ద హస్తం ఉండి ఉంటుంది.. ఆ హస్తం చంద్రబాబు ది ఎందుకు కాకూడదు అన్నట్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. దాడిశెట్టి రాజా పలు అనుమానాలను మీడియా ముందు ఉంచాడు.మొదటి నుండి కూడా చంద్రబాబు నాయుడుకు కుట్రలు పన్నడం అనేది తెలుసు.
పక్కా ప్లాన్ తోనే చంద్రబాబు పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టాడు.రెండు వర్గాల్లో కూడా ఆయన పార్టీకి చెందిన వారు ఉన్నారు. చంద్రబాబు మరియు పవన్ లు కోనసీమలో అలజడి సృష్టించి వదిలి పెట్టారు. అక్కడి జనాలు వారి మాటలు నమ్మి ఆందోళనలు చేస్తున్నారు. అప్పట్లో తుని ఘటనకు చంద్రబాబు నాయుడు కారణం.. ఇప్పుడు కోనసీమ చిచ్చుకు కూడా ఆయనే కారణం అంటూ బల్ల గుద్ది మరీ ఆయన పేర్కొన్నాడు. రాజకీయంగా వినియోగించుకునే ఉద్దేశ్యంతోనే పవన్ మరియు చంద్రబాబు నాయుడు కలిసి ఈ చిచ్చు రాజేశారు అంటూ ఇంకా పలువురు వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.