Chandrababu – Pawan Kalyan : బ్రేకింగ్.. చంద్రబాబు పవన్ ల బెస్ట్ ఫ్రెండ్ మీద చీటింగ్ కేసు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu – Pawan Kalyan : బ్రేకింగ్.. చంద్రబాబు పవన్ ల బెస్ట్ ఫ్రెండ్ మీద చీటింగ్ కేసు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :20 February 2023,10:00 pm

handrababu – Pawan Kalyan : లింగమేనని రమేశ్ పేరు ఎప్పుడైనా విన్నారా? రాజకీయాల్లో ఉన్నవారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన ఏపీలో రాజకీయాల్లో చాలా కీలక వ్యక్తి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చాలా దగ్గరి మనిషి. నిజానికి.. లింగమేనని రమేశ్ రాజకీయ వేత్త కాదు కానీ.. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకు చాలా పేరుంది. బిల్డర్ గా బాగా పాపులర్ అయ్యాడు. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో.. విజయవాడ కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉన్న ఆ బిల్డింగ్ లింగమనేనిదే.

Chandrababu and Pawan Kalyan police booked fir on lingamaneni ramesh in hyderabad for cheating

Chandrababu and Pawan Kalyan police booked fir on lingamaneni ramesh in hyderabad for cheatingChandrababu and Pawan Kalyan police booked fir on lingamaneni ramesh in hyderabad for cheating

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య రిలేషన్ షిప్ ను స్ట్రాంగ్ చేసింది కూడా లింగమేనని అనేది ప్రచారం. అవన్నీ పక్కన పెడితే తాజాగా హైదరాబాద్ పోలీసులు.. లింగమేనని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను లింగమనేని మోసం చేశాడంటూ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ బీఎన్ రావు కేసు నమోదు చేశారు. చైతన్య విద్యా సంస్థల బిల్డింగ్స్ నిర్మాణం కోసం బీఎన్ రావు, లింగమనేని మధ్య ఒప్పందం కుదిరింది. దాని కోసం రూ.310 కోట్లను లింగమనేనికి బీఎన్ రావు ఇచ్చారట. అంత డబ్బు తీసుకున్న లింగమనేని విద్యాసంస్థల విస్తరణ ప్రాజెక్ట్ ను టేకప్ చేయలేదట.

Chandrababu and Pawan Kalyan police booked fir on lingamaneni ramesh in hyderabad for cheating

Chandrababu and Pawan Kalyan police booked fir on lingamaneni ramesh in hyderabad for cheating

Chandrababu – Pawan Kalyan : లింగమనేని చేసిన మోసం ఏంటి?

దీంతో రమేశ్ ను నిలదీయగా.. పలు సార్లు కొన్ని చెక్కులు ఇచ్చాడట రమేశ్. అవి చెల్లలేదట.. దీంతో ఎలాగైనా డబ్బు చెల్లిస్తానని.. లేదా భూములు ఇస్తానని నమ్మబలికాడట. అలా.. 2016 లోనే బీఆర్ తో ఒక ఒప్పందం కూడా చేసుకున్నాడట లింగమనేని. కానీ.. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇప్పటి వరకు ఎలాంటి భూములు ఇవ్వకపోవడంతో హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసులకు రమేశ్ పై బీఆర్ ఫిర్యాదు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే అమరావతి ల్యాండ్ స్కామ్ పై కూడా రమేశ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కొత్త కేసు. వీటిని రమేశ్ ఎలా ఎదుర్కుంటారో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది