YS Jagan : వీళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా జగన్ స్ట్రాటజీ వేరయా…
YS Jagan : ఏపీలో వైసీపీని ఓడించేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే టీడీపీ, జనసేన కలిసినట్టుగా కనిపిస్తోంది. నిజానిక 2014 లోనే పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. టీడీపీకి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. టీడీపీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఆ తర్వాత బీజేపీతో పవన్ పొత్తు పెట్టకున్నారు కానీ.. బీజేపీ వల్ల పవన్ కు, పవన్ వల్ల బీజేపీకి ఒరిగింది మాత్రం ఏం లేదు.
అయితే.. బీజేపీతో అంటీ ముట్టనట్టుగానే ఉన్న పవన్ 2024 ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో మళ్లీ టీడీపీతో చేతులు కలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇటీవలే ఆయన చేతులు కలిపారు. అటు టీడీపీ అయినా.. ఇటు జనసేన అయినా.. మరోవైపు బీజేపీ అయినా.. ప్రస్తుతం ఏపీలో అందరి ముందు ఉన్న లక్ష్యం ఒకటే. వైసీపీని ఓడించాలి. దాని కోసం అన్ని పార్టీలు ఒక్కటయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
YS Jagan : బలమైన శత్రువును ఎదుర్కోవడం కోసం పొత్తులతో వెళ్లాలని అనుకున్నారా?
బలమైన శత్రువును ఎదుర్కోవడం కోసం ఒక్కరిగా రావడం కంటే కూడా పొత్తులతో వెళ్తేనే వర్కవుట్ అవుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందుకే.. చంద్రబాబు, పవన్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరి.. పవన్ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు పోటీ చేస్తారు.. చంద్రబాబును ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తారు అనేది పక్కన పెడితే.. చంద్రబాబు, పవన్ కలిసి ఎన్ని వ్యూహాలు చేసినా జగన్ స్ట్రాటజీలే వేరు అని వాళ్ల ప్లాన్స్ అన్నీ జగన్ ముందు దిగదుడుపే అంటూ చెప్పుకొస్తున్నారు వైసీపీ నేతలు.