కరోనా సమయంలో బాబు తలతిక్క నిర్ణయం..? ఇదేమి రాజకీయం..!
2019 ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహనాన్ని కోల్పోతూ మాట్లాడిన సందర్భాలు అనేకం చూశాం , కానీ తాజాగా బాబు మాటలు వింటే ఇదేనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం అనిపిస్తుంది. రాష్ట్రంలో కరోనా ఎలాంటి ప్రళయాన్ని సృష్టిస్తుందో అందరికి తెలిసిన విషయమే.. చిన్న పెద్ద, పేద ధనిక అనే తేడా లేకుండా అందరిని హడలెత్తిస్తోంది.
ఇలాంటి సమయంలో రాజకీయాలకు కొంచం విరామం ఇచ్చి ప్రజల కష్టాల్లో పాలుపంచుకునే ఆలోచన చేయక పోగా సొంత పార్టీ నేతలను ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా బాబు ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా వాక్సిన్ సరిగ్గా జరగటం లేదని ప్రశ్నిస్తే వైసీపీ నేతలు తిరిగి తమనే టార్గెట్ చేస్తున్నారంటూ బాధ బాధపడిపోయిన చంద్రన్న దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిచండి – ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో మే 8న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేయాలనే తీర్మానాన్ని తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ సమావేశం లో ఫైనల్ చేశాడు .
ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని, ఎంతోమంది తమ బంధువులను, కుటుంబసభ్యులను పోగుట్టుకున్నారని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది చచనిపోయారని ఇదే సమావేశంలో చెప్పిన బాబుకి తమ నేతలు 8 వ తేదీ ప్లకార్డులు పట్టుకొని గుంపులు గుంపులుగా నిరసన తెలిపితే కరోనా వ్యాపించకుండా ఉంటుందా..? కరోనా ఏమి వైసీపీకి విరోధి, చంద్రబాబుకు ఏమి చుట్టం కాదు కదా..? ఒక పక్క మా నేతలు చనిపోతున్నారని చెపుతూనే, మరోపక్క నిరసన తెలపాలి అంటూ తీర్మానాలు చేయటం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబుకు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నా దారుణాలు ఏమిటో కంటికి కనిపించలేదా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో కూడా రాజకీయాలు ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. చూస్తూ చూస్తూ అనేక వేల మంది కార్యకర్తల జీవితాలను బలిచేసే విధంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తున్నట్లు సమాచారం.