అయ్యో… చంద్రబాబు అమరావతి అడ్రస్ మరిచిపోయారే?
అసలు చంద్రబాబు అంటేనే ఇప్పుడు ఏపీలో గుర్తుపట్టని స్టేజ్ కు చేరుకున్నారు ఏపీ ప్రజలు. ఎందుకంటే.. చంద్రబాబు ఎక్కువగా ఉండేది హైదరాబాద్ లో. అంటే వేరే రాష్ట్రంలో. ఎప్పుడో అమావాస్య పున్నమికి ఏపీకి వస్తే ఎవరికి మాత్రం గుర్తుంటుంది. అందుకే.. చంద్రబాబు అమరావతి అడ్రస్ ను మరిచిపోవడం కాదు.. అసలు ఏపీ ప్రజలే చంద్రబాబును మరిచిపోయే స్థితికి చేరుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

chandrababu forgot amaravathi address
ఇది సంక్రాంతి సీజన్. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ బోగి మంటలు వేసుకొని.. మకర సంక్రాంతి, కనుమ కన్నుల పండువగా జరుపుకుంటారు. ఏపీలో గత సంవత్సరం నుంచి అమరావతి ఉద్యమం నడుస్తోంది. వాళ్లకు టీడీపీ కూడా మద్దతు ఇస్తోంది.
అందుకే 2020లో సంక్రాంతి పండుగను చంద్రబాబు అమరావతి రైతులతో కలిసి జరుపుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులను ప్రకటించగానే అమరావతికి జగన్ అన్యాయం చేశారంటూ చంద్రబాబు విమర్శించారు. అలాగే అమరావతి రైతులు కూడా ఉద్యమం చేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ల ఉద్యమం సాగుతూనే ఉన్నది. కానీ.. ఈసారి 2021 సంక్రాంతికి చంద్రబాబు అమరావతి రైతుల దగ్గరికి వెళ్లలేదు. వాళ్లతో సంక్రాంతి సంబురాలు జరుపుకోలేదు.
అమరావతి నినాదం ఏమైపోయింది చంద్రబాబు?
ఈసారి చంద్రబాబు వెరైటీగా కృష్ణా జిల్లా పరిటాలలో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఊరుకుంటారా? అదేంటి.. చంద్రబాబు అమరావతి అడ్రస్ మరిచిపోయారా? 2020 లో గుర్తున్న వీళ్లు.. 2021 వచ్చేసరికి గుర్తు రాలేదా? ఏంటి బాబు.. ఇలా చేశారు. అమరావతి సృష్టించిందే చంద్రబాబు.. ఆయన చెప్పారని.. రైతులంతా తమ భూమిని ఇచ్చేశారు. ఇప్పటికీ వాళ్లు ఉద్యమం చేస్తున్నారు. కానీ.. చంద్రబాబే మారిపోయారు.. అంటూ వార్తలు వస్తున్నాయి.
మరి.. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి.. అనే నినాదానికి చంద్రబాబు నీళ్లొదిలినట్టేనా? అంటే మాత్రం దానికి కాలమే సమాధానం చెప్పాలి.