ChandraBabu : 2 సీట్లు వైసీపీకి రాసిచ్చిన చంద్రబాబు?
ChandraBabu : 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఏపీలో ఎవరిది అధికారం. వైసీపీ గెలుస్తుందా? టీడీపీ గెలుస్తుందా? రెండు పార్టీలు మాత్రం హోరాహోరీగా పోటీ పడనున్నాయి. అధికార వైసీపీ పార్టీ మాత్రం ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా అంతే. రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి 2024 ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో సరిగ్గా తెలియదు. ఏ క్షణంలో అయినా జరగొచ్చు. ముందస్తు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే.. ముందస్తు వచ్చినా ఎన్నికలకు రెడీ అయ్యేందుకు టీడీపీ ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలను ఖరారు చేస్తోంది.
అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు అనేది అంత సులువు ఏం కాదు. ఎందుకంటే అధికార వైసీపీ పార్టీ బలంగా ఉంది. అంత ఈజీగా వైసీపీని ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా అభ్యర్థులను కూడా చంద్రబాబు ముందే ప్రకటిస్తున్నారు. సిట్టింగ్ లందరికీ టికెట్లను ముందే ప్రకటించారు. టీడీపీ నేతల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇది వరకులా కాకుండా చంద్రబాబు రాజకీయాలు ఈసారి దూకుడు రాజకీయం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఒక రెండు సీట్ల విషయంలో మాత్రం చంద్రబాబుకు ఏం అర్థం కావడం లేదు. చంద్రబాబు తీవ్ర మొహమాట పడుతున్నారు. కానీ..
ChandraBabu : రెండు సీట్ల విషయంతో మొహమాట పడుతున్న చంద్రబాబు
చంద్రబాబు ఇలాంటి అలవాటును వదిలించుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తుని, మైదుకూరు నియోజకవర్గాల విషయంలోనే చంద్రబాబు ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. మైదుకూరు సీటును డీఎల్ రవీంద్రారెడ్డి ఆశిస్తున్నారు. కానీ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా మైదుకూరు నుంచే పోటీ చేస్తా అని చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో చంద్రబాబుకు పాలుపోవడం లేదు. ఇప్పటికే సుధాకర్ యాదవ్ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరోవైపు తుని నుంచి కూడా యనమలకు సీటు ఇస్తారా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఎందుకంటే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వాళ్లకు సీట్లు ఇచ్చే అవకాశం లేదని చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకే ఈ రెండు సీట్ల విషయంలో చంద్రబాబుకు క్లారిటీ లేకపోతే ఆ సీట్లు మాత్రం వేరే పార్టీకి దక్కే అవకాశం ఉంది.