తాజా ఫలితాలతో చంద్రబాబు డీలా.. అటు ఇటు కాకుండా పోయాడే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

తాజా ఫలితాలతో చంద్రబాబు డీలా.. అటు ఇటు కాకుండా పోయాడే..!

దేశంలో ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందులో సృష్టంగా చెప్పాలంటే బీజేపీకి వ్యతిరేకమైన గాలి బలంగా వీచింది. మోడీ వ్యతిరేక శక్తులు తమ బలాన్ని పెంచుకోవటమే కాకుండా బీజేపీని మట్టి కరిపించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ లో యాంటీ మోడీ వర్గం విజయం సాధించింది. దీనితో దేశ వ్యాప్తంగా యాంటీ మోడీ క్యాంపైన్ మరోసారి తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఇదే టీడీపీ అధ్యక్షుడు Chandrababu Naidu కు పెద్ద […]

 Authored By brahma | The Telugu News | Updated on :3 May 2021,3:25 pm

దేశంలో ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందులో సృష్టంగా చెప్పాలంటే బీజేపీకి వ్యతిరేకమైన గాలి బలంగా వీచింది. మోడీ వ్యతిరేక శక్తులు తమ బలాన్ని పెంచుకోవటమే కాకుండా బీజేపీని మట్టి కరిపించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ లో యాంటీ మోడీ వర్గం విజయం సాధించింది. దీనితో దేశ వ్యాప్తంగా యాంటీ మోడీ క్యాంపైన్ మరోసారి తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఇదే టీడీపీ అధ్యక్షుడు Chandrababu Naidu కు పెద్ద చిక్కు సమస్యను తెచ్చిపెట్టింది.

ఇప్పుడు చంద్రబాబు మోడీ వర్గంలో ఉండాలా యాంటీ మోడీ వర్గంలో ఉండాలా అనేది తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. 2014 లో ఎలాగోలా ఢిల్లీ స్థాయిలో మంతనాలు చేసి, మోడీకి దగ్గరయ్యాడు. 2019కి వచ్చేసరికి యాంటీ మోడీ వర్గంలో చేరిపోవటంతో కాకుండా మోడీని ఓడించటానికి అన్ని రాష్ట్రాలు తిరిగొచ్చాడు. తీరా మోడీ ఘన విజయం సాధించి మరోసారి ప్రధాని అయ్యాడు. అపార మేధావి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, రాజకీయ దురంధురుడు అని చెప్పుకునే చంద్రబాబు సరిగ్గా ఇక్కడే బోల్తాకొట్టాడు.

chandrababu latest election results

chandrababu latest election results

అయితే ఆ తర్వాత యధావిధిగా మోడీకి దగ్గర కావటానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దేశ వ్యాప్తంగా మోడీ పనితీరుపై విమర్శలు వస్తున్నా కానీ, తాను మాత్రం పల్లెత్తు మాట కూడా అనటం లేదు. పైగా మోడీ చేసే తప్పులను జగన్ కు ఆపాదించి ఆయన్ని తిట్టటం అలవాటు చేసుకున్నాడు. అలాంటి బాబుకు ఇప్పుడు వచ్చిన ఫలితాలతో దేశంలో యాంటీ మోడీ టీమ్ బలపడుతుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో మోడీ టీం లో ఉంటే లాభమా లేక యాంటీ మోడీ టీమ్ లో ఉంటే లాభమా అనే లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే దేశంలోని యాంటీ మోడీ టీం కూడా చంద్రబాబును నమ్మే స్థితిలో లేదు. 2019 తర్వాత కూడా బాబు యాంటీ మోడీ స్టాండ్ తీసుకోని ఉంటే ఇప్పుడు నమ్మకం కుదిరేది, కానీ ఫలితాలు వచ్చిన వెంటనే మోడీ భజన చేసిన చంద్రబాబును నమ్మటానికి మిగిలిన రాజకీయ పక్షాలు సిద్ధంగా లేవని తెలుస్తుంది. ఇటు ఏమో మోడీ దగ్గరకి రానివ్వటం లేదు అటు ఏమో యాంటీ మోడీ టీం నమ్మటంలేదు. దీనితో బాబు పరిస్థితి అటు ఇటు కాకుండా పోయిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది